సోమవారం, ఫిబ్రవరి 16, 2015

పదహారేళ్ళకూ నీలో నాలో...

బాలచందర్ గారి అద్భుత సృష్టి "మరో చరిత్ర" చిత్రం లోనుండి ఓ అందమైన పాటను ఈరోజు తలచుకుందాం.. జానకి గారు, ఆత్రేయగారు, ఎమ్మెస్ గారు, బాలచందర్ గారు ఈ నలుగురిలో ఎవరిని పొగడాలీ ఈ పాట వినేటప్పుడు అనేది నాకు ఎప్పుడూ కన్ఫూజనే... నాకు చాలా ఇష్టమైన పాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మరోచరిత్ర (1978)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్ 
సాహిత్యం : ఆత్రేయ 
గానం : జానకి 

పదహారేళ్ళకూ నీలో నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు
కోటి దండాలు

పదహారేళ్ళకూ నీలో నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు
కోటి దండాలు 
వెన్నెలల్లే విరియ బూసి
వెల్లువల్లే ఉరకలేసే

పదహారేళ్ళకూ నీలో నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు
కోటి దండాలు

 
పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు
పాటలు పాడిన చిరు గాలులకు
 
పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు
పాటలు పాడిన చిరు గాలులకు
 
తెరచాటొసగిన చెలులు శిలలకూ
తెరచాటొసగిన చెలులు శిలలకూ
దీవెన జల్లులు చల్లిన అలలకూ
 
కోటి దండాలు శతకోటి దండాలు
పదహారేళ్ళకూ నీలో నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు
కోటి దండాలు

నాతో కలిసీ నడచిన కాళ్ళకు
నాలో నిన్నే నింపిన కళ్ళకు
నిన్నే పిలిచే నా పెదవులకు
నీకై చిక్కిన నా నడుమునకూ
 
కోటి దండాలు శతకోటి దండాలు
 
భ్రమలో లేపిన తొలి ఝాములకు
సమయం కుదిరిన సందె వేళలకు
నిన్నూ నన్నూ కన్న వాళ్ళకూ
నిన్నూ నన్నూ కన్న వాళ్ళకూ
మనకై వేచే ముందు నాళ్ళకూ
 
కోటి దండాలు శతకోటి దండాలూ
కోటి దండాలు శతకోటి దండాలు

పదహారేళ్ళకూ నీలో నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు
కోటి దండాలు
కోటి దండాలూ శతకోటి దండాలూ


1 comments:

పరభాషా ప్రేమికుల డిక్ష్ నరీ బాలచందర్ గారి మరో చరిత్ర..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.