ఆదివారం, ఫిబ్రవరి 01, 2015

జీవితం సప్తసాగర గీతం...

చిన్నికృష్ణుడు చిత్రంలోని ఒక చక్కని పాట ఈరోజు తలచుకుందాం. అమెరికా గురించి కృషీ ఖుషీ సంగమించే చోటంటూ ఇంత చక్కగా ఇంకెవరూ చెప్పలేదేమో. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చిన్ని కృష్ణుడు (1986)
సంగీతం : ఆర్.డి. బర్మన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, ఆషా భోంస్లే

తర..రా.తరతరా..తరా..తరా..తరతరా...

జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం
సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..
కల ఇల కౌగిలించే చోట
 
జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం
సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..
కల ఇల కౌగిలించే చోట

 
ఏది భువనం ఏది గగనం తారా తోరణం
ఈ చికాగో సియర్స్ టవరే స్వర్గ సోపానమూ
ఏది సత్యం ఏది స్వప్నం డిస్ని జగతీలో
ఏది నిజమో ఏది మాయో తెలీయనీ లోకమూ

 
హే... బ్రహ్మ మానస గీతం ఆఆ..
మనిషి గీసిన చిత్రం ఓఓఓ
చేతనాత్మాక శిల్పం
మతి కృతి పల్లవించే చోట...
మతి కృతి పల్లవించే చోట

జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం
సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..
కల ఇల కౌగిలించే చోట

ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్చా జ్యోతులూ
ఐక్య రాజ్య సమితిలోనా కలిసే జాతులూ
ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ..


హే... సృష్టికే ఇది అందం.. ఆఆ..
దృష్టికందని దృశ్యం.. ఆఅ..
కవులు రాయని కావ్యం... ఆఆఅ..
కృషి ఖుషి సంగమించే చోట..
కృషి ఖుషి సంగమించే చోట

జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం
సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..
కల ఇల కౌగిలించే చోట


3 comments:

చాలా అద్భుతమైన పాట..బట్ మనసుతో మాత్రమే ..ఐ మీన్ కనులు మూసుకుని వినాలి..తెరిచామా..యెదురుగా రమేష్ బాబు..

మహేష్ బాబు వాళ్ళ అన్నా?

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

అవును విజయ్ రాజ్ గారు మహేష్ వాళ్ళ అన్నే :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.