శనివారం, ఫిబ్రవరి 28, 2015

గుండె గూటికి పండుగొచ్చింది...

ఎగిరే పావురమా చిత్రం లోని ఈ అందమైన పాటను ఉన్నికృష్ణన్, సునీతలు పాడడంతో ఆ అందం రెట్టింపైందని నాకు అనిపిస్తుంటుంది. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఎగిరే పావురమా (1997)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం : వేటూరి
గానం : ఉన్నికృష్ణన్, సునీత

గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
 
గుండె గూటికి పండుగొచ్చింది..
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

నేలనోదిలిన గాలి పరుగున.. ఊరంతా చుట్టాలి
వేళ తెలియక వేల పనులను.. వేగంగా చేయాలి
ఇంటి గడపకి మింటి మెరుపుల.. తోరణమే కట్టాలి
కొంటె కలలతో జంట చిలకకి.. స్వాగతమే చెప్పాలి
ఎన్నెన్నో... ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది
ఏ పని తోచక తికమక పెడుతుంది

గుండె గూటికి పండుగొచ్చింది..
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

బావ మమతల భావ కవితలే... శుభ లేఖలు కావాలి
బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు... సుముహుర్తం రావాలి
మా ఏడు అడుగుల జోడు నడకలు... ఊరంతా చూడాలి
వేలు విడువని తోడూ ఇమ్మని.. అక్షింతలు వేయాలి
ఇన్నాళ్ళూ... ఇన్నాళ్ళు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో
రాణిని తీసుకు వచ్చే కళకళ కనపడగ

గుండె గూటికి పండుగొచ్చింది..
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ


1 comments:

పాపం లైలాకి నవ్వడం తప్ప మరే ఎక్స్ ప్రెషన్ రాదు కాబట్టి..ఈ పాట చక్కగా సూట్ అయ్యింది..చక్రి యాజ్యూజువల్ టూ గుడ్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.