మహనది చిత్రం కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈరోజు ఏకాదశి కదా ఈ పాట వింటూ ఆ రంగనాధుని తలచుకుందామా. ఎంబెడ్ చేసిన వీడియోలో మొదటి చరణం మాత్రమే ఉంది. పూర్తి పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : మహానది (1993)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు, చిత్ర, బేబి శోభన
గంగా శంకాశ కావేరీ
శ్రీరంగేశ మనోహరీ
కళ్యాణకారి కలుషారీ
నమస్తేస్తు సుధాఝరీ
ఆ ఆ ఆ ఆ.......
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటి ముత్యాలు.. కృష్ణవేణిలో అలలగీతాలు
నీలవేణిలో నీటి ముత్యాలు.. నీరజాక్షుడికి పూలుగా
కృష్ణవేణిలో అలలగీతాలు.. కృష్ణ గీతలే పాడగా
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
కృష్ణాతీరాన అమరావతిలో..
శిల్పకళావాణి పలికిన శృతిలో
అలలై పొంగేను జీవనగీతం
కలలే పలికించు మధుసంగీతం
చల్లగా గాలి పల్లకీలోన పాట ఊరేగగా...
వెల్లువై గుండె పల్లె పదమల్లి పల్లవే పాడగా...
శ్రీ త్యాగరాజ కీర్తనై సాగె తీయనీ జీవితం...
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షునికి పూలుగా
కృష్ణవేణిలో అలలగీతాలు కృష్ణ గీతలే పాడగా
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
గంగను మరపించు ఈ కృష్ణవేణి
వెలుగులు ప్రవహించు తెలుగింటి రాణీ
పాపాల హరియించు పావన జలమూ...
పచ్చగ ఈనేల పండించు ఫలమూ...
ఈ ఏటి నీటి పాయలే తేటగీతులే పాడగా...
సిరిలెన్నొ పండి ఈ భువి స్వర్గలోకమై మారగా...
కల్లకపటమే కానరానీ ఈ పల్లెసీమలో....
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షునికి పూలుగా
కృష్ణవేణిలో అలలగీతాలు కృష్ణ గీతలే పాడగా
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
1 comments:
హృద్యమైన పాట..బట్ ఈ మూవీ కొంతమందికైనా కనువిప్పు కలిగిస్తే..వెరీ హాంటింగ్ మూవీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.