గురువారం, మార్చి 12, 2015

రానేల వసంతాలే...

కొన్ని మెలోడీలు మదిలో అలా ముద్రించుకు పోతాయి ఎలాంటి సంధర్బంలో విన్నా ఆ పాట మాధుర్యంలో అలా లీనమవడం తప్ప మరో పని చేయలేం. ఇళయరాజా గారు స్వరపరచిన పాటలలో అలాంటివి కోకొల్లలు వాటిలో ఒక పాట ఇది. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : డాన్స్ మాస్టర్ (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి 
గానం : చిత్ర

రానేల వసంతాలే.. శ్రుతి కానేల సరాగాలే
నీవే నా జీవనరాగం.. స్వరాల బంధం
నీదే నా యవ్వన కావ్యం.. స్మరించే గీతం

రానేల వసంతాలే..
 
ఈ మౌన పంజరాన.. నే మూగనై
నీ వేణువూదగానే నీ రాగమై
ఎగిరే శోకమై విరిసే తోటనై
ఏ పాట పాడిన పది పూవులై
అవి నేల రాలిన చిరుతావినై
బదులైనలేని ఆశలారబోసి

రానేల వసంతాలే..
 
ఓ ప్రేమికా చెలియా.. ఒడి చేరవా
ఈ చెలిమినీ ఇపుడే దరిజేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా
నీ చూపుతోనే చలి తీరగా
నీ స్పర్శతోనే మది పాడగా
ఎదమీటి పోయే ప్రేమగీతిలాగా

రానేల వసంతాలే.. శ్రుతి కానేల సరాగాలే
నీవే నా జీవనరాగం.. స్వరాల బంధం
నీదే నా యవ్వన కావ్యం.. స్మరించే గీతం

రానేల వసంతాలే.. శ్రుతి కానేల సరాగాలే


1 comments:

ఈ మూవీ ని ముందు బాలచందర్ గారు విషాదాంతం చేసినా..ప్రేక్షకులు జీఋనించుకోలేక పోయారని, మళ్ళీ లాస్ట్ టూ రీల్స్ తీసేసి సుఖాంతం చేశారు ఆంధ్రాలో..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.