మంగళవారం, మార్చి 31, 2015

సుందరి నేనే నువ్వంట...

దళపతి చిత్రం కొసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక అద్భుతమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : దళపతి(1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా
గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా

అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా
మధురాల మధువులు చింది చల్లని ప్రేమే మాయమా
ఆఆ...రేపవలు నిద్దరలోను యద నీ తోడే కోరును
యుద్ధాన యేమైనా నా ఆత్మే నిన్నే చేరును
యద తెలుపు ఈ వేళ యేల ఈ శోధన
జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన
నాలో ప్రేమే మరిచావు
ప్రేమే నన్నే గెలిచేనే
 
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా
సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా

పువ్వులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే
ఊహలే పూలై పూచు నీ యద మాటున చేరితే
ఆఆఅ.. మాసాలు వారాలౌను నీవూ నేనూ కూడితే
వారాలు మాసాలౌను మాటే మారి సాగితే
పొంగునే బంధాలే నీ దరి చేరితే
గాయాలు ఆరేను నీ యెదుట వుంటే
నీవే కదా నా ప్రాణం
నీవే కదా నా లోకం

సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా
గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా 

 

1 comments:

యెన్నో డబ్బింగ్ సాంగ్స్ కి యెక్కడా లిప్సింక్ తేడా లేకుండా అద్భుతమైన సాహిత్యాన్ని రాజశ్రీ గరికి హేట్సాఫ్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.