మంగళవారం, మార్చి 10, 2015

ఆకాశం నుంచి మేఘాలే...

మిత్రుడు చిత్రంలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మిత్రుడు (2009)
సంగీతం : మణిశర్మ
రచన : వెన్నెలకంటి
గానం : విజయ్ ఏసుదాస్ , కౌసల్య

ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట
హరివిల్లులోని రంగులు నేలకు వచ్చి సరదాలే చేస్తే ఆట
కోయిల గొంతున సరిగమలే అల్లరి పాటకు పల్లవులైతే
చల్లని మనసుల మధురిమలే అల్లిన పల్లవి చరణాలైతే
 
కన్నె కుట్టి వచ్చాడులే అందాల మామయ్య
కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య
 
ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట
 
హరివిల్లులోని రంగులు నేలకు వచ్చి సరదాలే చేస్తే ఆట
ఆనందం అభిమానం మా తోట పువ్వులులే
అనురాగం అనుబంధం మా గూటి గువ్వలులే
 
సంతోషం సల్లాపం మా ఇంటి దివ్వెలులే
ఉల్లాసం ఉత్సాహం మా కంటి నవ్వులులే
మా సాటి ఎవ్వరు మా పోటి లేరెవరు 
గుండెల చప్పుడు వింటుంటే కొండలు కోనలు పలికేనంట
పండిన మమతలు పలికెలే ఎండలు కూడా వెన్నెలలే 

కన్నె కుట్టి వచ్చాడులే అందాల మామయ్య
కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య
ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట
హరివిల్లులోని రంగులు నేలకు వచ్చి సరదాలే చేస్తే ఆట
 
ఆశలు ఎన్నో అందరిలోన వుంటాయిలే
కన్నులు ఎన్నో తీయని కలలు కంటాయిలే
ఊహలలోన ఎదలే ఊయల ఊగాలిలే
ఓ కధలాగ జీవితమంతా సాగలిలే
ఈ కమ్మని రోజు ఇక మళ్ళీ మళ్ళీ రాదంట
మా మనసుల మమత ఇక మాసి పోనే పోదంట 

కన్నె కుట్టి వచ్చాడులే అందాల మామయ్య
కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య


1 comments:

చాలా మంది సింగర్స్ కి లేని అదృష్టం శ్రీ యేసుదాస్ గారికి విజెయ్ యేసుదాస్ రూపం లో దక్కింది అనిపిస్తుంది..ముమ్మూర్తులా తండ్రి అంతటి ప్రతిభ కలిగిన సింగర్ శ్రీ విజెయ్ యేసుదాస్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.