శుక్రవారం, మార్చి 06, 2015

హోలీ శుభాకాంక్షలు...

మిత్రులందరకూ హోలీ శుభాకాంక్షలు.. కోటి కాంక్షల కలువలతో ఇంద్రధనుసుల రంగులు పెనవేసి మరి ఆడేద్దామా హోలీ. ఐతే ఖుషి చిత్రంలోని ఈ హుషారైన పాటను వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 

చిత్రం : ఖుషి (2001)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : మనో, స్వర్ణలత

హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి
హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో
హోలి హోలి ల రంగ హోలి హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ
రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు
చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి దూకేటి చెంగు చెంగు

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో

ఓ పాలపిట్ట శకునం నీదెనంట
ఓ మల్లెమొగ్గా మనసే కోరెనంట
చిలిపి వలపు వగరు పొగరు కోకిలలు
కలలు కన్న కన్నె వన్నె కోరికలు
చెరువులోన తామరాకుపై ఊగే మంచు ముత్యమేమన్నది
చిన్నదాని సొంతమైన సంపంగి ముక్కుపుల్లనౌతనన్నది
హొహొ హొహొ అందమైన చెంప మీద
హొహొ హొహొ కెంపువోలె సిగ్గులొలికె
హొహొ హొహొ కెంపులన్ని ఏరుకొచ్చి పట్టు గొలుసు కట్టుకుంటరో

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో

హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి
హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి

ఓ ఏకవీర తిరుగే లేదు లేర
ఓ పూలతార వగచే రోషనార
అడుగు పడితె చాలు నేల అదురునులే
పడుచు వాలు చూపు పడిన చెదరనులే
పల్లె కూనలెదురు వచ్చి యేలేలో యెంకి పాట పాడుతారులె
అచ్చమైన పల్లె సీమ పాటంటే గుండెతోనె ఆలకిస్తలె
హొహొ హొహొ పొన్న చెట్టు నీడలోన
హొహొ హొహొ పుట్ట తేనె జొన్న రొట్టె
హొహొ హొహొ జంటగూడి ఒక్కసారి నంజుకుంటె ఎంత మేలురో

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో
హోలి హోలి ల రంగ హోలి హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ
హోలి హోలి ల రంగ హోలి హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ
రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు
చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి దూకేటి చెంగు చెంగు

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో

1 comments:

రంగుల హరివిల్లు లాంటి హోలీ..అందరికీ ఆనందాల కేళి..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.