గురువారం, మార్చి 05, 2015

గోరంకకెందుకో కొండంత అలక...

ఎంతటి అలకలో ఉన్నవారైనా ఇట్టే కరిగించే హాయైన పాట ఇది ఎంత బాగుంటుందో మీరే వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : దాగుడుమూతలు (1964)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల

గోరంకకెందుకో కొండంత అలక
అలకలో యేముందో తెలుసుకో చిలకా
గోరంకకెందుకో కొండంత అలక
అలకలో యేముందో తెలుసుకో చిలకా
గోరంకకెందుకో కొండంత అలక

కోపాలలో ఏదో కొత్త అర్ధం ఉంది
గల్లంతులో ఏదో గమ్మత్తు ఉంది
కోపాలలో ఏదో కొత్త అర్ధం ఉంది
గల్లంతులో ఏదో గమ్మత్తు ఉంది
ఉరుములు మెరుపులు ఊరికే రావులే
ఉరుములు మెరుపులు ఊరికే రావులే
వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే
వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే

గోరంకకెందుకో కొండంత అలక
అలకలో యేముందో తెలుసుకో చిలకా
గోరంకకెందుకో కొండంత అలక
  
 మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది
మాటకు మనసుకు మధ్యన తగవుంది
మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది
మాటకు మనసుకు మధ్యన తగవుంది
తగవు తీరేదాక తలుపు తీయెద్దులే
తగవు తీరేదాక తలుపు తీయెద్దులే
ఆదమరచి అక్కడే హాయిగా నిదరపో

గోరంకకెందుకో కొండంత అలక
అలకలో యేముందో తెలుసుకో చిలకా
గోరంకకెందుకో కొండంత అలక


1 comments:

అసలిలా బ్రతిమాలించుకోడానికే అలగాలనిపిస్తుందండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.