సోమవారం, మార్చి 30, 2015

ప్రియా ప్రియా అంటూ...

దేవీశ్రీ కంపోజ్ చేసిన "కలుసుకోవాలని" సినిమాలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కలుసుకోవాలని (2002)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : వేణు, సుమంగళి

ప్రియా ప్రియా అంటూ నా మది
సదా నిన్నే పిలుస్తున్నది
దహించు ఏకాంతమే సహించలేనన్నది
యుగాల ఈ దూరమే భరించలేనన్నది
విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది

కన్నీళ్ళలో ఎలా ఈదను
నువే చెప్పు ఎదురవని నా తీరమా
నిట్టూర్పుతో ఎలా వేగను
నిజం కాని నా స్వప్నమా హా

 ఎలా దాటాలి ఈ ఎడారిని
ఎలా చేరాలి నా ఉగాదిని

క్షణం క్షణం నిరీక్షణం తపించవా స్నేహమా
ప్రియా ప్రియా అంటూ నా మది
సదా నిన్నే పిలుస్తున్నది

ఒకే ఒక క్షణం చాలుగా
ప్రతి కల నిజం చేయగా
యుగాలు కలకాలమా ఇలాగే నూఆగుమా
దయుంచి ఆ దూరమా ఇవాళ ఇటు రాకుమా
ఇదే క్షణం శిలాక్షరం అయ్యేట్టు దీవించుమా


3 comments:

నాకు చాలా ఇష్టమైన పాట.. అప్పట్లో ఈ పాట రింగ్ టోన్ కూడా చాలా ఎక్కువగా వినిపించేది ..

థాంక్స్ రాజ్యలక్ష్మి గారు.. అవునండీ అప్పట్లో రింగ్ టోన్ గా కూడా ఎక్కువగా వినిపించేదీ పాట.

మంచి ఫ్యూచర్ ఉన్న నటుడు..టీవీ మీడియా లోకి యెంటర్ ఐనా హేపీ గా ఉండే వాడేమో కదండీ..అనవసరం గా నిండు లైఫ్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.