మంగళవారం, మార్చి 03, 2015

ఆ పూలరంగు నీ చీర చెంగు...

ఏసుదాస్ గారు మోహన్ బాబు గారి కోసం పాడిన పాటలన్నీ కూడా సూపర్ హిట్సే.. ఒక సెంటిమెంట్ గా మంచి పాటలని మాత్రమే ఆయనకిచ్చి పాడించేవారనుకుంటాను. ఈ పాట అంతటా నేపద్యంలో వచ్చే మ్యూజిక్ బిట్ నాకు చాలా ఇష్టం. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : దొంగ పోలీస్ (1992)
సంగీతం : బప్పిలహరి
సాహిత్యం : రసరాజు
గానం : ఏసుదాస్, చిత్ర

ఆ పూలరంగు నీ చీర చెంగు..
రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులే..
రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో

ఓ తేనె దొంగ నా సామిరంగ..
పుట్టాను నీకై పూసాను పూవై
నీ వెంట ఉంటానులే.. నీ దాననౌతానులే..
మరి నీలోని గీతాన్నిలే..
 
 
సరి సరి గరిగపద...సరి సరి గరిగపద...

పసుపుగ విరిసిన పూవులు..
తలపై కురిసెను పలికెను ..
ఉండాలనీ పచ్చగా... హోయ్
ఎర్రగ విరిసిన పూవులు..
ఎదపై కురిసెను పలికెను 
ఉండాలనీ ప్రేమతో...
ఆ రంగుతోటి ఈ రంగు కలిసే.. నీకాళ్ళపారాణిగా..
నా కళ్ళలో రాణిగా... నా కళ్ళలో రాణిగా...

ఓ తేనె దొంగ నా సామిరంగ..
పుట్టాను నీకై.. పూసాను పూవై
 
నే పాడుకుంటానులే
రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో

కలిసిన కనులకే తెలియును..
వలపుల మలుపుల సొగసులు..
ఏ ప్రేమబంధాలివో...
నడిచిన అడుగులే కలుపును..
మనుసును మనసును ఒకటిగా
ఏరాగబంధాలివో... హోయ్
ఆ బంధమేదో అనుబంధమేదో 
పాడాలి భూపాలమై.. అందానికే మూలమై.. 
అందానికే మూలమై..
 
ఆ పూలరంగు నీ చీర చెంగు
రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులే..హోయ్
రాగాల లోగిళ్లలో అనురాగాల వాకిళ్ళలో


1 comments:

ఈ పాట త్రూ అవుట్ సాగే బీట్ , శ్రీ యేసుదాస్ గారి వాయస్..మనసుని కుదిపేస్తాయి..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.