నారారోహిత్ నటించిన 'శంకర' సినిమా లోని ఒక చక్కని పాట ఈరోజు తలచుకుందాం. ఎంబెడ్ చేసినది వీడియో ప్రోమో మాత్రమే పూర్తి పాట ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. యూట్యూబ్ పని చేయకపోతే పూర్తి ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : శంకర(2014)
సంగీతం : సాయి కార్తీక్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : సమీర్
ఎదలోన ఏమా సరిగమ
చిరునవ్వులు పూచిన ఘుమఘుమ
నాపైనే కన్నేసింది ఏం మాయో మరి
ఓ కొంచెం అర్ధం అయ్యి అర్ధం కానట్టుంది
చిరునవ్వులు పూచిన ఘుమఘుమ
నాపైనే కన్నేసింది ఏం మాయో మరి
ఓ కొంచెం అర్ధం అయ్యి అర్ధం కానట్టుంది
వోహో ఏమిటిది వోహో ఎవరి పని
వోహో ఎందుకిది ఎందుకిలాగా
వోహో ఏమిటిది వోహో ఎవరి పని
వోహో కదిలినది మనసున తీగా..
ఎన్నాళ్లిలా అవుతోందిలా
చుట్టూరా నన్ను అల్లేసిందే కొంటె వల
కొన్నాళ్లుగా నేన్నాలా లేకున్నా
మాటైనా నాకు చెప్పలేదే ఎవ్వరైనా
చూపుకే కనిపించక ఎపుడెలా ఎలా తెలవారెనో
కన్నులే మూసినా మెలకువై ఉన్నా నిదురించు సరదాలా..
వోహో వోహో వోహో ఏమిటిది వోహో ఎవరి పని
వోహోకదిలినది మనసున తీగా..
అన్నీ విన్నా వింటూ ఉన్నా
చిరు గాల్లో చేరే సందేశాలు ఏమంటున్నా
గమనిస్తున్నా గుండెల్లో దాస్తున్నా
ఈ సమయం నాకు ఇష్టంగా ఏమందిస్తున్నా
చాలదే ఇది చాలదే
అనిపించే ఇదే తెలిసేంతలో
ప్రేమతో ప్రేమగా మనసెంతో దూరం కదిలిందిలే ఎపుడో
ఎదలోన ఏమా సరిగమ
చిరునవ్వులు పూచిన ఘుమఘుమ
నాపైనే కన్నేసింది ఏం మాయో మరి
ఓ కొంచెం అర్ధం అయ్యి అర్ధం కానట్టుంది
వోహో ఏమిటిది వోహో ఎవరి పని
వోహో ఎందుకిది ఎందుకిలాగా
వోహో ఏమిటిది వోహో ఎవరి పని
వోహో కదిలినది మనసున తీగా..
1 comments:
నారా రోహిత్ సాంగ్స్ చాలా వరకూ కాస్త డిఫరెంట్ గా ఇంటెరెస్టింగా ఉంటుంటాయి..ఇది ఫరవా లేదు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.