శుక్రవారం, మార్చి 20, 2015

నిను చూడక నేనుండలేను...

ఒకప్పుడు తెలుగు సినీ సంగీతాన్ని ఒక ఊపు ఊపేసిన అద్భుతమైన పాటలు అందించిన నీరాజనం సినిమాలోని ఒక చక్కని మెలోడి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : నీరాజనం (1988)
సంగీతం : ఓ పి నయ్యర్,
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : బాలు, జానకి

ఆఆఆఆఅహాహాహా
ఆఆఆఆఅహాహాహా
ఓహో ఓహో ఓహో 

నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను

ఓహోహో..ఆహాహా..
ఆహాహా..ఓహోహో..
ఆహాహా.. ఓహోహో..
ఓహోహో..ఆహాహా..

ఏ హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకుంటిని
ఏ చిరుగాలి కదలాడినా
నీ చరణాల శృతి వింటిని
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నిను చూడక నేనుండలేను

ఓహోహో..ఆహాహా..
ఆహాహా..ఓహోహో 
ఓహాహా..ఆహోహో..
ఆహాహా..ఓహోహో..

నీ జత గూడి నడయాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం
ఎంత హృదయంగమం
మన ప్రతి సంగమం
ఎంత హృదయంగమం

నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను
 
నిను చూడక నేనుండలేను 
నిను చూడక నేనుండలేను....

1 comments:

క్లాసిక్..మా నానారికి ఓపీనయ్యర్ అన్నా, నౌషాద్ అన్నా ప్రాణం వేణూజీ..థాంక్యూ ఫర్ ప్రెజెంటింగ్ ద సాంగ్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.