సోమవారం, మార్చి 16, 2015

నీతో చెప్పనా...

అతడు చిత్రం కోసం మణిశర్మ స్వరసారధ్యంలో సిరివెన్నెల రచన ఇది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : అతడు (2005)
సంగీతం : మణిశర్మ 
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా
 
గారం చేసిన నయగారం చూపిన
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా
నేనే నేనుగా లేనే లేనుగా ఆ… 
నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ …

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా

 
ఇంకొంచం అనుకున్నా ఇక చాల్లె అన్నానా
వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మనా
పనిమాల పైపైన పడతావేం పసికూన
ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా
మగువ మనసు తెలిసేనా మగజాతికి   
మోగలి మోనలు తగిలేనా లేత సోయగానికీ కూత దేనికి

గారం చేసిన నయాగారం చూపిన
కనికారమే కలుగుతొందే కష్టపడకే కాంచనా

ఒదిగున్న ఒరలోన కదిలించకే కురదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టుజారినా
పెదవోపని పదునైన పరవాలేదనుకోన
కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా
సొంత సొగసు బరువేనా సుకుమారికి 
అంత బిరుసు పరువేనా రాకుమారుడంటి నీ రాజాసానికి
 
గారం చేసిన నయాగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా
నేనే నేనుగా లేనే లేనుగా ఆ… 
నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ…


1 comments:

క్లాసికల్ ని వెస్ట్రన్ తో మిక్స్ చేసి చాలా అందంగా ఫ్యూజన్ చేస్తారు మణిశర్మగారు..అలానే మెలోడీ ని ఆయన వెస్ట్రనైజ్ చేసే విధానం చాలా బావుంటుంది..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.