శనివారం, మార్చి 07, 2015

సుందరాంగులను చూసిన వేళల...

సుందరాంగులను చూసిన వేళల పిచ్చను పడినా ముచ్చట పడినా ఏదో ఒక తడబాటున మాత్రం పడక తప్పదని తేల్చేసిన పింగళి వారి ఈ సరదా అయిన పాట ఈరోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల, ఏ. ఎం. రాజా, పి. లీల

సుందరాంగులను చూసిన వేళల
కొందరు ముచ్చట పడనేలా?
కొందరు పిచ్చను పడనేలా?
సుందరాంగులను చూసిన వేళల
కొందరు ముచ్చట పడనేలా?
కొందరు పిచ్చను పడనేలా?

 
అందము, ప్రాయము, ఐశ్వర్యము గల
సుందరి దొరకుటె అరుదు కదా!
అందము, ప్రాయము, ఐశ్వర్యము గల
సుందరి దొరకుటె అరుదు కదా!
ముందుగ యెవరిని వరించునో యని
తొందరలో మతిపోవు కదా!

సుందరాంగులను చూచిన వేళల
కొందరు పిచ్చను పడనేలా?
కొందరు ముచ్చట పడనేలా?

 
హృదయము నందలి ప్రేమగీతమే
మధురముగా వినిపించు గదా!
హృదయము నందలి ప్రేమగీతమే
మధురముగా వినిపించు గదా!
మందహాసమున మనసును దెలిపే
ఇందువదన కనువిందు కదా!

 
ప్రేమపరీక్షలు జరిగే వేళల
కొందరు పరవశపడనేలా,
కొందరు కలవరపడనేలా?

 
యువతి చెంత పర పురుషుడు నిలిచిన
భావావేశము కలుగు కదా!
యువతి చెంత పర పురుషుడు నిలిచిన
భావావేశము కలుగు కదా!
ప్రేమ పందెమును గెలిచే వరకు
నా మది కలవరపడును కదా!

ప్రేమపరీక్షలు జరిగే వేళల
కొందరు కలవరపడనేలా,
కొందరు పరవశపడనేలా?

 
కోయిల పలుకుల కోమలి గాంచిన
తీయని తలపులు కలుగు గదా!
కోయిల పలుకుల కోమలి గాంచిన
తీయని తలపులు కలుగు గదా!
వరములొసంగే ప్రేమదేవి గన
పరవశమే మది కలుగు కదా!

 
సుందరాంగులను చూసిన వేళల
కొందరు ముచ్చట పడనేలా?
కొందరు పిచ్చను పడనేలా?


1 comments:

ముచ్చట కంటే రెండోదే యెక్కువ యే రోజుల్లోనైనా..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.