ముగ్గురు మొనగాళ్లు చిత్రంలోని ఓ సరదా సరిగమల జుగల్ బందీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ముగ్గురు మొనగాళ్ళు (1994)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : భువన చంద్ర
గానం : బాలు, చిత్ర
రారా.. స్వామి రారా...
యదువంశ సుధాంబుధి చంద్ర స్వామి రారా
శతకోటి మన్మధాకారా
నారీజన మానస చోరా స్వామి రారా
యదువంశ సుధాంబుధి చంద్ర స్వామి రారా
శతకోటి మన్మధాకారా
నారీజన మానస చోరా స్వామి రారా
స్వామి రారా ఆఆఆఆ...
రారా రారా గోపాలా నిన్నే కోరే ఈ బేల
రావే రావే మధుబాలా విన్నా కన్నా నీ గోల
నా సిల్క్ చీరనడుగు ఈ పూల రైకనడుగు
నా సిల్క్ చీరనడుగు - అడిగా
ఈ పూల రైకనడుగు - అడిగా
ఇక అడిగినదడగను చూసేయ్ నా ఒడుపు
రారా రారా గోపాలా
రావే రావే మధుబాలా
ధీంత నననం ధీంత నననం తానా
నట్టువాంగం కోమలాంగం జోడు కడితే రాజా
ధీంత నననం ధీంత నననం ధీంత నన ధిరధిర తానా
రేయి పవలై హాయి సెగలై రెచ్చిపో నా రాధ
మ్మ్..నట్టువాంగం కోమలాంగం జోడు కడితే రాజా
రేయి పవలై హాయి సెగలై రెచ్చిపో నా రాధ
వెచ్చని ఒంపుల్లో వెన్నెల జల్లుల్లో
అల్లరి హద్దుల్లో అద్దిన ముద్దుల్లో
అది ఏం మోహమో ఇది ఏం దాహమో
ఆ..రావే రావే మధుబాలా విన్నా కన్నా నీ గోల
రారా రారా గోపాలా నిన్నే కోరే ఈ బేల
ఓ..గగ గరిగ గగ గరిగ గగ గరి సగరిగ సరిద
కొంటె మేళం జంట తాళం జతులు నేర్పేస్తుంటే
సస సనిద సస సనిద సస సని పదరిస సస
పైట చెంగే పట్టు పరుపై నాట్యమాడేస్తుంటే
ఆ..కొంటె మేళం జంట తాళం జతులు నేర్పేస్తుంటే
పైట చెంగే పట్టు పరుపై నాట్యమాడేస్తుంటే
తనువుల కవ్వింపు తలగడకే ఇంపు
వేసేయ్ తాలింపు కానీ లాలింపు
ఓకే సుందరి జల్దీ రా మరి
ఆ..రారా రారా గోపాలా నిన్నే కోరే ఈ వేళ
అరెరెరె రావే రావే మధుబాలా విన్నా కన్నా నీ గోల
నా సిల్క్ చీరనడుగు ఈ పూల రైకనడుగు
నా సిల్క్ చీరనడుగు - అడిగా
ఈ పూల రైకనడుగు
ఇక అడిగినదడగను చూసేయ్ నా ఒడుపు
1 comments:
ఈ మూవీలో ఇది దీ బెస్ట్ సాంగ్..వింటే డాన్స్ చెయ్యకుండా ఉండలేరెవ్వరూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.