బుధవారం, మార్చి 25, 2015

కాలమైన దైవమైన...

డాన్స్ మాస్టర్ చిత్రంలో ప్రేమ గురించిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : డాన్స్ మాస్టర్ (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం
త్యాగరాజ కీర్తనల్లె రాగమల్లుకున్న జీవితం
నిప్పులాంటి ఆశయం నీరుకాని నిశ్చయం  
ఆడకూ అగ్నితో హే బహుపరాక్ పో..
కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం
 
వీచే గాలీ నీ సొంతం కాదు
తనకంతం లేదు అది ఆపేదెవరూ
 
మాలో ప్రేమకూ ఎదురే లేదు
ఏ బెదురూ లేదు ఇక నిదరే రాదు
మొగ్గలై రాలిపోవాలా పువ్వులై నవ్వుకోవాలా
మొగ్గలై రాలిపోవాలా పువ్వులై నవ్వుకోవాలా
 
ఆహా పూవంటి నీ ఒంటికే తావినై
మదిలో మధువై మనసే తనువై నేడు
 
కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం
త్యాగరాజ కీర్తనల్లె రాగమల్లుకున్న జీవితం  

పేచీ కొస్తేను పూచీ మాదా 
తెగ వాచీ పోదా మారీచా నీచా.. 
రాజీ కొచ్చేయి మాజీ యోధా
మాతాజీ నాధ మరియాదే లేదా 
ఆయుధాలేవీ లేకున్నా అత్మవిశ్వాసం మాతోడూ
ఆయుధాలేవీ లేకున్నా అత్మవిశ్వాసం మాతోడూ
ప్రేమ తుప్పంటనీ చండ్రనిప్పంటిదీ  
వలపు గెలుపు చివరకు మావే లేవోయ్

కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం
త్యాగరాజ కీర్తనల్లె రాగమల్లుకున్న జీవితం
నిప్పులాంటి హా ఆశయం హా 
నీరుకాని హా నిశ్చయం హా
ఆడకూ అగ్నితో హే బహుపరాక్ పో..
కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం

కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం
త్యాగరాజ కీర్తనల్లె రాగమల్లుకున్న జీవితం 

1 comments:

యం.యెస్ .విశ్వనాధంగారు, బాలచందర్ గారు, కమల్ హసన్ కాంబినేషన్ తరువాత..మరచిపోలేని మరో మ్యూజికల్ హిట్ కాంబినేషన్ బాలచందర్ గారు, కమల్, ఇళయరాజాగారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.