సోమవారం, ఫిబ్రవరి 02, 2015

ఈ లోకం అతి పచ్చన...

వసంత కోకిల చిత్రం లోని ఒక చక్కని పాట నేడు తలచుకుందాం.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : వసంత కోకిల (1982)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : బాలు

ఈ లోకం అతి పచ్చన... తోడుంటే నీ పక్కన
ఎదలో ఎదగా మసలే మనసుంటే..
జతగా నడిచే మనిషుంటే ...

ఈ లోకం అతి పచ్చన... తోడుంటే నీ పక్కన

 

ప్రేమకు లేదు వేరే అర్ధం
ప్రేమకు లేదు వేరే అర్ధం
ప్రేమకు ప్రేమే పరమార్ధం
ప్రేమకు ప్రేమే పరమార్ధం
ప్రేమించు... ఆ ప్రేమకై జీవించూ
నవ్వుతూ.. నవ్వించూ

ఈ లోకం అతి పచ్చన... తోడుంటే నీ పక్కన
ఎదలో ఎదగా మసలే మనసుంటే..
జతగా నడిచే మనిషుంటే...
ఈ లోకం అతి పచ్చన... తోడుంటే నీ పక్కన

 
ప్రతి నదిలోను అలలుంటాయి
ప్రతి నదిలోను అలలుంటాయి
ప్రతి ఎదలోను కలలుంటాయి
ప్రతి ఎదలోను కలలుంటాయి
ఏ కలలూ ఫలియించునో.. శృతి మించునో
కాలమే చెబుతుందీ

ఈ లోకం అతి పచ్చన... తోడుంటే నీ పక్కన
ఎదలో ఎదగా మసలే మనసుంటే..
జతగా నడిచే మనిషుంటే ...
ఈ లోకం అతి పచ్చన... తోడుంటే నీ పక్క 


1 comments:

ఈ దృశ్య కావ్యాన్ని మలచిన బాలూ మహేంద్ర గారికి హేట్సాఫ్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.