గురువారం, ఫిబ్రవరి 26, 2015

మౌనమేలనోయి...

సాగరసంగమం చిత్రంలోని ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే కదా... ఇళయరాజా, వేటూరి, బాలు, జానకి, విశ్వనాథ్ గారు, జయప్రద, కమల్ వాహ్ ఎంతటి మేలు కలయిక.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : సాగర సంగమం (1982)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ఆఆఆఆఆఆఅ...
మౌనమేలనోయి...
మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి
మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి

ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
తారాడే హాయిలో..
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి

 
పలికే పెదవి వొణికింది ఎందుకో?
వొణికే పెదవి వెనకాల ఏమిటో?
కలిసే మనసులా.. విరిసే వయసులా
కలిసే మనసులా.. విరిసే వయసులా
 
నీలి నీలి ఊసులు లేతగాలి బాసలు..
ఏమేమో అడిగినా 

మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి

 
హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగుల వలపూమడుగుల
ఇవి ఏడడుగుల వలపూమడుగుల
కన్నె ఈడు ఉలుకులు కంటిపాప కబురులు...  
ఎంతెంతొ తెలిసిన

మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెల ఆఆఆఅ వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల
ఆఆఆఅ వెలిగే కన్నుల
తారాడే హాయిలో..
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి 

3 comments:

అవును జ్యోతిర్మయి గారు, థాంక్స్ ఫర్ ద కామెంట్.

విశ్వనాధ్ గారి సినిమాల్లో విరహం,శృగారం తాంబూలం వేసుకున్న తరువాత పండే పెదవంత అందంగా,సున్నితంగా ఉంటాయి..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.