మంగళవారం, ఫిబ్రవరి 24, 2015

కుడికన్ను అదిరెనే...

స్వరాభిషేకం సినిమా కోసం విశ్వనాథ్ గారు స్వయంగా రాసిన ఈ పాట విన్నారా.. అచ్చం అన్నమయ్య కీర్తనలా అనిపించే ఈ గీతానికి అంతే అద్భుతంగా స్వరాలందించినది పార్ధసారధి గారు. ఈ చిత్రానికి సంగితం అందించినది విద్యాసాగర్ గారు అయినప్పటికీ ఈ పాట ఒక్కటీ మాత్రం పార్ధసారధి గారు కంపోజ్ చేశారుట. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : స్వరాభిషేకం (2004)
సంగీతం : పార్థసారధి (ఈపాటకు మాత్రమే)
సాహిత్యం : కె.విశ్వనాథ్
గానం : బాలు, సునీత

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు

మేలుమేలాయెనే మంగ మాయమ్మకు
అలకల తీపులు ఆర్చినందుకు
మేలుమేలాయెనే మంగ మాయమ్మకు
అలకల తీపులు ఆర్చినందుకు
చాలుచాలాయె చెలి బుగ్గలకు
ఆఆఆ..చాలుచాలాయె చెలి బుగ్గలకు
చెలువంపు గాటున చెక్కినందుకు

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన

తెలుపరే భానునికి తెలవారలేదనీ
తెలుపరే భానునికి తెలవారలేదనీ
పులిసినమేనా కొలది పవళించినందుకు
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
నలిగిన గుబ్బల నెలత అలసిసొలసినందుకు

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన

స స గ రి ని ద మ ద ని ని ని ద ని స
గ గ మ ని ద మ ద ని స ద మ గ రి గ మ ని ద
సా... ని ద మ గ రి స
ద ని స ద ని స ద ని స ద ని స

తీయకే...ఆఆఆఆఅ.... ఆ గడియ ఆఆఆఆఅ 
తీపిఘడియలు వేలు మ్మ్..మ్.మ్.మ్.మ్...
తిరునాధు కౌగిలిని కాగువరకు
సాయకే...ఏ.. ఆ మేను...
సాయకే ఆ మేను సరసాల సమయాలు
సరిగంచు సవరించి సాగువరకూ

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు



3 comments:

రెండు క్యాసెట్టులు అరిగి మూడోదికొన్నాక కాస్త నిలబడినవి మా ఇంటిలో ఈ సినిమా పాటలు.అందరికీ అంత ఇష్టం మొత్తం పాటలన్నీ చాలా బాగుంటాయ్.అందించినందుకు ధన్యవాదాలు.

థాంక్స్ లక్ష్మి గారు :-)

తెలవారలేదో స్వామీ..కూడా చాలామంది అన్నమాచార్యులవారు రచించిన కీర్తనే అనుకున్నారండీ శృతిలయలు రిలీజ్ అయిన రోజుల్లో..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.