శనివారం, అక్టోబర్ 29, 2016

వెండి చీర చుట్టుకున్న...

కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రంలోని ఒక హుషారైన పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కృష్ణగాడి వీర ప్రేమ గాథ 
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం : కృష్ణకాంత్
గానం : రాహుల్ నంబియార్, సింధూరి విశాల్

వెండి చీర చుట్టుకున్న వెచ్చనైన వెన్నెలా
వచ్చివాలి చంపమాకు నన్నిలా
చిచ్చు బుడ్డి కళ్ళతోటి గుచ్చుకుంటే నువ్వలా
మచ్చుకైన విచ్చుకోదు నవ్విలా

అబ్బ ఇంత కోపమా
దగ్గరుండి దూరమా
తియ్యనైన కొరివి కారమా
పదును లేదు సులువు కాదు
మలుపులేని నలుపు దారిదే

అలాగ ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకలా...
ఊ అంటే వుడికిపోయి ఉరిమి పడకలా
ఓ హొ హొ... ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకలా...
తుఫాను హొరులోన గాలి పటములా...

బుల్లి విలనుతో పాటు
పిల్ల దెయ్యమే కాదు
బుజ్జి బూతం వుంది నువ్వు ముద్దు పెట్టకే
ప్రేమ చూపడం లేటు
లేని పోనిది డౌటు
చిన్ను బుజ్జికావు కాస్త హద్దు దాటితే

కొలవలేని గారమా
పొగుడుతుంటే నేరమా
లైఫు టైము తెగని బేరమా
పొగడమాకు వినను నీకు
లొంగనింక బేరమాడకు

అలాగ ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకలా...
ఊ అంటే వుడికిపోయి పడకలా
ఓ హొ హొ... ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకలా...
తుఫాను హొరులోన గాలి పటములా...

పెళ్ళి తంతుకే మేము పెద్ద మనుషులం కామ?
పక్కనున్న లెక్కలేదు మేము హర్ట్ లే
బుజ్జి బుగ్గలే మావి ముద్దు పెట్టరా మీరు
బుంగ మూతి పెట్టుకోము మేము హర్ట్ లే

చిన్ని చిన్ని నవ్వులం
చిట్టి పొట్టి పిల్లలం
చుట్టుకుంటే విడిచిపోములే
బ్లాక్ రోడ్ రెడ్ కార్
పైగా మేము బంపర్ ఆఫర్

అలాగ ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకలా...
ఊ అంటే వుడికిపోయి ఉరిమి పడకలా
ఓ హొ హొ... ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకలా...
తుఫాను హొరులోన గాలి పటములా...


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.