గాయత్రీ దేవి రూపంలో ఈరోజు దర్శనమీయనున్న దుర్గమ్మకు నమస్కరించుకుంటూ శివుడు శివుడు శివుడు చిత్రం లోని ఈ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శివుడు శివుడు శివుడు (1983)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
ఓం....
ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం
ఇదం శాస్త్రమిదం శస్త్రం
ఇదం నాట్యమిదం వేదం
ఇదం పూర్ణమిదం పరం
ఇదం సర్వమిదం హితం
ఓం..ఓం..ఓం..
నరుడే హరుడు నారాయణుడీనాడూ
నరుడే హరుడు నారాయణుడీనాడూ
శరం పడితె అర్జునుడు పధం పడితే త్రినేత్రుడు
ఆత్మబలానికి తోడుగా దేహ బలం ఉంటే
మానవుడే మహామహుడు మరో శివుడు వీడూ
నరుడే హరుడు నారాయణుడీనాడూ
కదనానికి నటనానికి మాతృక ఓంకారం.. ఓం..
ఒకటి ధనుష్టంకారం ఒకటి చలన్మంజీరం
ఇవిరెండూ ఆంగికం ఇహ పరసం సాధకం
నిటలాక్షుడు రక్షకుడై నటరాజే శిక్షకుడై
నటనగాని సమరానికి నడచి రార రణధీర
నరుడే హరుడు నారాయణుడీనాడూ
నరుడే హరుడు నారాయణుడీనాడూ
సుందరకర అంగాంగం ఆత్మకు ఆకారం
సుందరకర అంగాంగం ఆత్మకు ఆకారం
ప్రకటజన్మ సంకేతం ప్రభుద్ధాత్మ సంసారం
ఈదేహం నేడిక రసనాట్యమ్ చేయగా
ఆది శక్తి అర్చనగా వేదసూక్తి కీర్తనగా
కదలిరార కదనానికి కర్మయోగి నీవేరా
నరుడే హరుడు నారాయణుడీనాడూ
నరుడే హరుడు నారాయణుడీనాడూ
గ్రీష్మాతపము తాకి గిరగిరని ధరజారు
హిమనిర్ఝరీ ఝరీపాత సంగీతాల
పలుకులకు నెన్నడును మరతలై సవ్వడులు
కులుకులై పరవడుల సాగే
పరవడుల సాగే తరంగిణుల తకతై తకఝుణుత
ఝుణు తకిడిత తకధిత్తళాంగమను తాళాలతో
ఉచ్చిష్టమగ్నిగా ఉమిసి మూడవ కన్ను తెరచి
ఉత్తిష్టుడై రోగనిర్విష్టుడై కర్మ సంవిష్టుడై
ప్రళయ లయ నిష్టుడై లయలోన సృష్టినే
ప్రియమార జరిపించు శిష్టుడై వెలసేటి
ఖండపర సురఖండ ఖండ కమలాలతో
2 comments:
చక్కటి పాట..వన్స్ అపాన్ యే టైం..అంటే పాట పరంగా ఇప్పటికీ అనుకోండి..ఆ గాయత్రీ అమ్మవారి కరుణ మీ కుటుంబానికి పరిపూర్ణం గా కలగాలని కోరుకుంటున్నాము వేణూజీ..
థాంక్స్ శాంతి గారు మీకు కూడా గాయత్రీ అమ్మవారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.