మంగళవారం, అక్టోబర్ 25, 2016

పచ్చబొట్టేసిన...

బాహుబలి చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.



చిత్రం : బాహుబలి (2016)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : కార్తీక్, దామిని

పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంటరోడా నీతో
కొంటె తంటాలనే తెచ్చుకుంటాదొరా

వేయి జన్మాల ఆరాటమై
వేచి ఉన్నానే నీ ముందరా
చేయి నీచేతిలో చేరగా
రెక్క విప్పిందె నా తొందర

పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

మాయగా నీసోయగాలాలు వేసి
నన్నిలా లాగింది నువ్వే హలా
కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా
హత్తుకుపో నను ఊపిరి ఆగేలా
బాహు బంధాల పొత్తిళ్ళలో
విచ్చుకున్నావె ఓ మల్లికా
కోడె కౌగిళ్ల పొత్తిళ్ళలో
పురి విప్పింది నాకోరిక

పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

కానల్లో నువునేను ఒకమేను కాగా
కోనలో ప్రతికొమ్మ మురిసేనుగా
మరుక్షణమే ఎదురైనా
మరణం కూడా పరవశమే
సాంతం నేను నీ సొంతం అయ్యాక
చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో
చిందులేసింది సిరివెన్నెల
ప్రేమ ఊరేటి నీకళ్ళలో
రేయి కరిగింది తెలిమంచులా

పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంటరోడా నీతో
కొంటె తంటాలనే తెచ్చుకుంటాదొరా

3 comments:

రాఘవేంద్ర రావుగారి ముద్రలో ఉండే రాజమౌళి పాట.

అవునండీ మొదటి సారి చూసినపుడు రాఘవేంద్రరావు గారే తీశారేమో అనిపించింది :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.


వినబుల్ పాటల తో మన
వినికిడి పెంచిన జిలేబి వీరవుదురుగా !
కనిపించుచు శ్రీకాంతుడు
వినిపించెను వేణుగాన వింజోవిగనన్ !

జిలేబి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.