అన్నపూర్ణా దేవి అలంకరణలో నేడు దర్శనమిచ్చే ఆ దుర్గమ్మను జీవకోటి ఆకలి బాధను తీర్చాలని కోరుకుంటూ. స్వర్ణకమలం చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : స్వర్ణ కమలం (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, వాణీ జయరాం
గురు బ్రహ్మః గురు విష్ణుః
గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మః ఆ.. ఆ
గురు సాక్షాత్ పరబ్రహ్మః ఆ.. ఆ
తస్మై శ్రీ గురవే నమ:
ఓం నమో నమో నమశ్శివాయ
మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ
గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ
ఓం నమో నమో నమశ్శివాయ
శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ
అందెల రవమిది పదములదా
అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా
అమితానందపు ఎద సడిదా
సాగిన సాధన సార్ధకమందగ
యోగ బలముగా యాగ ఫలముగా
సాగిన సాధన సార్ధకమందగ
యోగ బలముగా యాగ ఫలముగా
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా
అందెల రవమిది పదములదా ఆ.. ఆ
మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై.. ఆ.. ఆ..
వేణి విసురు వాయు వేగమై.. ఆ.. ఆ
అంగ భంగిమలు గంగ పొంగులై
హావభావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల.. రస ఝరులు జాలువారేలా
జంగమమై జడమాడగా జలపాత గీతముల తోడుగా
పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
అందెల రవమిది పదములదా?... ఆ.. ఆ...
నయన తేజమే నకారమై
మనో నిశ్చయం మకారమై
శ్వాస చలనమే శికారమై
వాంచితార్ధమే వకారమై
యోచన సకలము యకారమై
నాదం నకారం మంత్రం మకారం
స్తోత్రం శికారం వేదం వకారం
యజ్ఞం యకారం ఓం నమశ్శివాయ
భావమె భవునకు భావ్యము కాగా
భరతమె నిరతము భాగ్యము కాగా
తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళా
ప్రాణ పంచమమె పంచాక్షరిగా పరమపధము ప్రకటించగా
ఖగోళాలు పద కింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా
అమితానందపు ఎద సడిదా
అందెల రవమిది పదములదా ఆ.. ఆ..
2 comments:
భానుప్రియ..యల్ విజయలక్ష్మి తరువాత నృత్యపరంగా విపరీతం అభిమానించేది ఈవిడనే..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.