బుధవారం, అక్టోబర్ 12, 2016

ప్రణామం ప్రణామం ప్రణామం...

ఈ ప్రకృతి గురించి వర్సటైల్ రైటర్ రామజోగయ్య శాస్త్రి గారి కలం నుండి జాలువారిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జనతాగ్యారేజ్ (2016)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : శంకర్ మహదేవన్ 
 
తోం.. ధిరననన ధిర ధిర న 
తోం.. ధిరననన ధిర ధిర న
తోం. ధిరన తోం ధిరన ధీర ధీర నానా.. 
తోం.. ధిరననన ధిర ధిర న 
తోం.. ధిరననన ధిర ధిర న

ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం
ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
విశ్వంతో మమేకం ప్రయాణం

తోం.. ధిరననన ధిర ధిర న 
తోం.. ధిరననన ధిర ధిర న
తోం. ధిరన తోం ధిరన ధీర ధీర నానా.. 

మన చిరునవ్వులే పూలు
నిట్టూర్పులు తడి మేఘాలు
హృదయమే గగనం రుధిరమె సంద్రం ఆశే పచ్చదనం
మారే ఋతువుల వర్ణం
మన మనసుల భావోద్వేగం
సరిగా చుస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతి బింబం
నువ్వెంత నేనెంత రవ్వంత
ఎన్నో ఏళ్ళదీ సృష్టి చరిత
అనుభవమే దాచింది కొండంత
తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా

ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం

ఎవడికి సొంతమిదంతా
ఇది ఎవ్వడు నాటిన పంట
ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా
తరములనాటి కధంతా
మన తదుపరి మిగలాలంటా
కదపక చెరపక పది కాలాలిది కాపాడాలంటా
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం
ఇష్టంగా గుండెకు హత్తుకుందాం
కన్నెర్రయితే నీరై ఓ కొంచెం
తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం

ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం

తోం.. ధిరననన ధిర ధిర న 
తోం.. ధిరననన ధిర ధిర న
తోం. ధిరన తోం ధిరన ధీర ధీర నానా..
 

2 comments:

చాలాకాలం తరువాత మంచి హిట్ జూనియర్ యన్ టి ఆర్ కి..

నిజమే శాంతి గారు.. చాలా రోజుల తర్వాత మంచి హిట్ వచ్చింది తనకి. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.