మంగళవారం, అక్టోబర్ 18, 2016

జ్యో అచ్యుతానంద - అన్నిపాటలు

మెలోడియస్ సంగీతానికి మారుపేరుగా నిలిచే శ్రీ కళ్యాణ్ రమణ గారు సినిమా సినిమాకి తన పేరు మార్చుకున్నా తన పాటల తీరు మాత్రం మార్చకుండా వినసొంపైన సంగీతం అందిస్తూనే ఉన్నారు. అటువంటి తనకి మంచి అభిరుచి ఉన్న దర్శకుడు దొరికితే ఇక శ్రోతల వీనులకు విందే కదా. శ్రీనివాస్ అవసరాల కోసం కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన "జ్యో అచ్యుతానంద" ఆల్బమ్ అటువంటిదే. 

కవికి మంచి సాహిత్యాన్ని సృష్టించగల సంధర్బాన్ని ఇచ్చి తగినంత స్వేచ్ఛని కూడా ఇస్తే ఎలాఉంటుందో భాస్కరభట్ల గారు ఈ సినిమాలో చూపించారు. ఇప్పటివరకూ మాస్ పాటలకు మాత్రమే పరిమితమనుకున్న వీరి కలం అందించిన అందమైన తెలుగు సాహిత్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. 

ఈ సినిమాలోని అన్ని పాటలు నాకు నచ్చేశాయ్. మీరూ విని అనందించండి. ఈ పాటలు ఆడియో ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ జ్యూక్ బాక్స్ లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. సినిమా ప్రోమో ఇంకా వీడియో సాంగ్ ప్రోమోస్, పూర్తి పాటలు ఇక్కడ.


చిత్రం : జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం : శ్రీ కళ్యాణ రమణ
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : కార్తీక్, రమ్య బెహరా

ఆకుపచ్చని చందమామలా మారిపోయె భూలోకం
ఈ రోజే గమ్మత్తుగా
గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం
దాచేయ్యాలన్నంతగా
కేరింతల్లో ఇలా... సీతాకోకలా.. ఎగిరిందిలే మనస్సంతా
సంతోషం ఏదంటూ అందర్నీ అడగాలా
మనచుట్టే వుంటుందిగా చూస్తే ఇలా


ఆహాహా బాగున్నదీ
ఈ హాయి బాగున్నదీ 
 
ఆకుపచ్చని చందమామలా మారిపోయె భూలోకం
ఈ రోజే గమ్మత్తుగా
గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం
దాచేయ్యాలన్నంతగా 

తరించే క్షణాలే ఏరి క్షణంలో నిధుల్లా మార్చుకుందాం
తమాషా కబుర్లే తెచ్చి మనస్సు అరల్లో పేర్చుకుందాం
వసారాలు దాటొచ్చాయీ వసంతాలు ఈ వేళా  
తుషారాలు చిరునవ్వుల్లో కురిసేలా
ప్రతీ దారి ఓ మిణుగుర్లా మెరుస్తోంది ఈ వేళా 
కలుస్తున్నవే నింగినేలా

ఆహాహా బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ  
ఈ హాయి బాగున్నదీ
ఈ హాయి బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ 
బాగున్నదీ బాగున్నదీ
 
భుజంతో భుజాన్నే తట్టి బలంగా భరోసా ఇచ్చుకుందాం  
ఒకర్లో ఒకర్లా మారి నిదర్లో కలల్నే పంచుకుందాం
మహా మత్తులో ఈరోజే పడేస్తోంది ఈ గాలీ
సుగంధాలు ఏం జల్లిందో అడగాలీ
మరో పుట్టుకా అన్నట్టూ మరీ కొత్తగా వుందీ
ఇందేం చిత్రమో ఏమో గానీ
ఆహాహా బాగున్నదీ

ఆహాహా బాగున్నదీ  
ఈ హాయి బాగున్నదీ
ఈ హాయి బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ  

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం : శ్రీ కళ్యాణ రమణ
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : సింహ

ఆల్చిప్ప లాంటి నీ కళ్ళు రెండు తిప్పుతూ
హైరానా పెట్టకే పిల్లా పిల్లా
జాంకాయ లాగ మాంచి దోరగున్న ఈడుతో
ఊరించి చంపకే పిల్లా పిల్లా

చక్కెర కలిపిన పటాసులా 
ఆ చిటపట లేంటే బాలా
విప్పొదిలేసిన కుళాయిలా
చిరునవ్వులు రువ్వేయ్ గలా గలా
తొలిసారి ప్రేమలో ఇలా ఎలా
జారి పడ్డాను వెల్లాకిల్లా

సువర్ణ సువర్ణ సువర్ణ
నీ పేరుంది నాలుక చివర్న
సువర్ణ సువర్ణ సువర్ణ
నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్న

 
హే.. కథాకళీ చుశా  నీ నడకల్లో
హే హే.. నాగావళీ హొయలున్నవె మెలికల్లో
బుసకొట్టకే బంగారీ నస పెట్టకె నాంచారీ
తల తిప్పుకు పోకే టపుక్కునా
ఇక పెట్టకు నన్నే ఇరుక్కునా
తెగ బెట్టుచేస్తవే బజారునా
చుట్టు జనాలు చూడాలనా

సువర్ణ సువర్ణ సువర్ణ
నీ పేరుంది నాలుక చివర్న
సువర్ణ సువర్ణ సువర్ణ
నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్న


హే.. అనార్కలీ అరసున్నా నడుముల్లో
ఏహే.. దీపావళీ వచ్చిందీ మే నెల్లో
నడిరాతిరి తెల్లారీ..పోతున్నా పొలమారీ
నువు కాదని అంటే పుసుక్కునా
నా ప్రాణం పోదా పుటుక్కునా
నా మనసు నాపడం అయ్యేపనా
నువ్వు కారాలు నూరేసినా

ఆల్చిప్ప లాంటి నీ కళ్ళు రెండు తిప్పుతూ
హైరానా పెట్టకే పిల్లా పిల్లా
జాంకాయ లాగ మాంచి దోరగున్న ఈడుతో
ఊరించి చంపకే పిల్లా పిల్లా

చక్కెర కలిపిన పటాసులా 
ఆ చిటపట లేంటే బాలా
విప్పొదిలేసిన కుళాయిలా
చిరునవ్వులు రువ్వేయ్ గలా గలా
తొలిసారి ప్రేమలో ఇలా ఎలా
జారి పడ్డాను వెల్లాకిల్లా

సువర్ణ సువర్ణ సువర్ణ
నీ పేరుంది నాలుక చివర్న
సువర్ణ సువర్ణ సువర్ణ
నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్న

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

 
చిత్రం : జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం : శ్రీ కళ్యాణ రమణ
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : శంకర్ మహదేవన్

నిరిసా... నిరిపమా...ఆఆ..ఆఆఅ..

ఒక లాలన ఒక దీవెన 
సడిచేయవా ఎద మాటునా
ఒక లాలన ఒక దీవెన 
సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన 
చిగురించదా పొరపాటునా
 
కలబోసుకున్న ఊసులు
ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు
మెలమెల్లగా ఎటుపోయెనో

ఒక లాలన ఒక దీవెన 
సడిచేయవా ఎద మాటునా
 
ఇంత కాలం దాచుకున్న ప్రేమనీ హాయినీ
కాలమేమీ దోచుకోదు ఇమ్మనీ
పెదవంచు మీదా నవ్వునీ పూయించు కోడం నీ పనీ
నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమనీ

ఒక లాలన ఒక దీవెన 
సడిచేయవా ఎద మాటునా 
తియ తీయని ప్రియ భావన 
చిగురించదా పొరపాటునా

అందనంత దూరమేలే నింగికీ నేలకీ
వానజల్లే రాయబారం వాటికీ
మనసుంటె మార్గం ఉండదా ప్రతి మనిషి నీకే చెందడా
ఈ బంధమే ఆనందమే నువు మోసుకెళ్లే సంపదా

ఒక లాలన ఒక దీవెన 
సడిచేయవా ఎద మాటునా
ఒక లాలన ఒక దీవెన 
సడిచేయవా ఎద మాటునా 
తియ తీయని ప్రియ భావన 
చిగురించదా పొరపాటునా
 
కలబోసుకున్న ఊసులు
ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు
మెలమెల్లగా ఎటుపోయెనో

ఒక లాలన ఒక దీవెన 
సడిచేయవా ఎద మాటునా

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం : శ్రీ కళ్యాణ రమణ
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : శ్రీ కళ్యాణరమణ, స్మిత

ఇదేమి గారడీ.. ఇదేమి తాకిడీ.. భలేగ వుందిలే ఇదీ
ఇదేమి లాహిరీ.. ఇదేమి జాజిరీ.. తెలీదుగాని బాగుందీ

ఇదేమి అల్లరీ.. ఇదేమి గిల్లరీ.. పరాకు గుందిలే మదీ
అదేదొ మాదిరీ.. ఇదేమి ఆవిరీ.. మనస్సు ఊయలూగిందీ

డారి దారిలో.. సుమాలు పూసినట్టు
ఈ గాలి జోల పాడిందే
పెదాల గూటిలో.. పదాలు దాచినట్టు
మహత్తుగున్నదీ ఇదీ
 
 
జో అచ్యుతానంద.. జో అచ్యుతానంద
జో అచ్యుతానంద.. జో అచ్యుతానంద

ఇదేమి ఉక్కిరీ ..ఇదేమి బిక్కిరీ ..భరించడంఎలా ఇదీ
గులాబి జాబిలీ ..గులేబకావళీ.. పడేసి ఆడుకుంటోందీ

ఇదేమి చిత్రమో ..ఇదేమి చోద్యమో..తెలీని యాతనే ఇది
చమక్కు వెన్నెలా.. చురుక్కు ఎండలా గుండెల్లో గుచ్చుకుంటోందీ

స్వరాల వీణలే చిరాకు పాట లాగ
చెవుల్లొ గోల చేస్తోందే
తరించు హాయిలో దహించు మంటలాగ
సహించలేనిదీ ఇదీ
 
జో అచ్యుతానంద.. జో అచ్యుతానంద
జో అచ్యుతానంద.. జో అచ్యుతానంద హ..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం : శ్రీ కళ్యాణ రమణ
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : హరిణిరావ్

ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన
చిగురించదా పొరపాటునా

కలబోసుకున్న ఊసులు
ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు
మెలమెల్లగా ఎటుపోయెనో

ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటునా

అంతులేనీ ఇష్టమంతా గంగలా పొంగనీ
ఆనకట్టే వేసుకోకూ వద్దనీ
కలపాలనుంటే చేతినీ ఎగరాలనుంటే మనసునీ
దాచేయకూ.. ఆపేయకూ ..
అటు వైపు సాగే అడుగునీ

ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన
చిగురించదా పొరపాటునా

కలబోసుకున్న ఊసులు
ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు
మెలమెల్లగా ఎటుపోయెనో
 
 

2 comments:

ఇదీ ఒక పాటల పందిరే సుమండీ..

ఈ సినిమా పాటలు రెండూ నాకు బాగా నచ్చేశాయండీ...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.