బుధవారం, అక్టోబర్ 19, 2016

అరెరే ఎంటిది ఎంటిది...

ధనుష్ కీర్తి సురేష్ నటించిన రైల్ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రైల్ (2016)
సంగీతం : డి.ఇమ్మాన్
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : హరిచరణ్

అరెరే ఎంటిది ఎంటిది 
ఎదో జరిగినది జరిగినది!!
ఎదలో ఇదివరకెరుగని 
అలజడి పెరిగినది పెరిగినది!!
కలలాగ కరిగేనా నీవైపే జరిగేనా 
నీవడిలో ఒదిగేనా ఒదిగేనా

నిన్నే ఎద చేరెను చేరెను 
నీలో అది దూరెను దూరెను 
లోకం సరికొత్తగ మారినదీ.. 
ఆశే నిను కోరెను కోరెను 
చూసీ నోరూరెను ఊరెను 
ఐనా ఈ దాహం తీరనిదీ.. 
మనసే కోవెలగా చేసీ దేవతవై నువ్వున్నా 
మమతే మంత్రంగా పలికే పూజారిగా నేనున్నా 
ఎద నీకే హారతి చేసి ఎదురే చూస్తున్నా 
 
అరెరే ఎంటిది ఎంటిది 
ఎదో జరిగినది జరిగినది!!

గసరే చిరు నవ్వులు నవ్వులు 
విరిసే ఇరు పువ్వులు పువ్వులు 
కొసరే కసి కోరిక రేపినవీ...
ఎదలో సిరిమువ్వలు మువ్వలు 
ఎగిరే జత గువ్వలు గువ్వలు 
ఎగసే ఆ నింగిని తాకినవీ...
మాటే మౌనంగా మారితే మనసే నీకిచ్చాలే 
బాటే పయనంగా మారితే నీడై నేనొచ్చాలే 
ఎన్ని జన్మాలైనా గానీ మారదు మన జంట 
 
అరెరే ఎంటిది ఎంటిది 
ఎదో జరిగినది జరిగినది!!
కలలాగ కరిగేనా నీవైపే జరిగేనా 
నీవడిలో ఒదిగేనా ఒదిగేనా
అరెరే ఎంటిది ఎంటిది 


2 comments:

ఈ పాట చూస్తున్నప్పుడు కొన్ని విజువల్ ఎఫెక్ట్సే ఐనా..ప్రకృతి ఒడిలో ఉన్నట్టే ఉంటుంది..

అవునండీ చక్కగా తీశారీ పాట.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.