ఊపిరి చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఊపిరి (2016)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : మదన్ కార్కీ
గానం : రంజిత్, సుచిత్ర
అయ్యో అయ్యో అయ్యో అయ్యో
చందమామ కిందికొచ్చి ముద్దు పెట్టే
అయ్యో అయ్యో అయ్యయ్యయ్యో
ఎండ వేళ ఎన్నెలొచ్చి కన్ను గొట్టే
పంచదార పాకమేదో దొరికిందే
కంచె దాటి చిట్టి చీమ ఎగిరిందే
కుండపోత మల్లె వాన కురిసిందే
ఊపిరంతా ఉక్కపోత పెరిగిందే
సీతాకోక చిలకల గుంపు నడుమొంపుల్లో కితకితలాడే
శీతాకాలం పిల్లడి వైపు పరిగెడుతోంది ఎదిగిన ఈడే
హే సడి లేని జడి వానై నను చుట్టుముట్టి సూది గుచ్చినావే
పొగ లేని సెగ నువ్వై నాతొ అంటుగట్టి మంట పెట్టినావే
అరె నా ఒంటి తీగకు ఇన్నేసి మెలికలు నేర్పింది నువ్వే
పిల్ల రంగు పిట పిటా చెంగు చెంగు చిట పటా
కంటి ముందే అట్ట ఇట్ట తిప్పుకుంటూ తిరుగుతున్నదే
ఒంపు సొంపు కిట కిట చెప్పలేని కట కటా
చూపు తోనే గట గటా దప్పికేమో తీరకున్నదే
సీతాకోక చిలకల గుంపు నడుమొంపుల్లో కితకితలాడే
అయ్యో అయ్యో అయ్యో అయ్యో
చందమామ కింది కొచ్చి ముద్దు పెట్టే
యాడికేల్తే ఆడికొచ్చి వెంట వెంట పడకు
ఆశ పెట్టి అందనని అనకూ
గాలి సైగలేవో చేసి అవ్వి ఇవ్వి అడ్డక్కు
కత్తిపీటతో నా గుండె తరక్కూ
హయ్యోరామ అందం చిగురాకు
అంత పని చేస్తుందనుకోకు
చేసే పని చేస్తూ నీ సోకు వెన్నపూస రాస్తోందే నాకు
అరె నీ కష్టమంతా నా కష్టమేగా కంగారే పడకూ
ఏ పిల్ల రంగు పిట పిటా చెంగు చెంగు చిట పటా
కంటి ముందే అట్ట ఇట్ట తిప్పుకుంటూ తిరుగుతున్నదే
ఒంపు సొంపు కిట కిట చెప్పలేని కట కటా
చూపు తోనే గట గటా దప్పికేమో తీరకున్నదే
అయ్యో అయ్యో అయ్యో అయ్యో
చందమామ ముద్దు పెట్టి చిచ్చు పెట్టే
అయ్యో అయ్యో అయ్యాయ్యయ్యో
ఎండ వేళ ఎన్నెలొచ్చి రెచ్చగొట్టే
దూరముంటే నీకు నాకు ఇబ్బందే
ఉండలేను ఉన్నవన్ని ఇవ్వందే
అందమంతా నీకు అప్పగించందే
ఆడ ఈడు నిద్దరయినపోనందే
పంచదార పాకమేదో దొరికిందే
కంచె దాటి చిట్టి చీమ ఎగిరిందే
కుండపోత మల్లె వాన కురిసిందే
ఊపిరంతా ఉక్కపోత పెరిగిందే
2 comments:
ఫీల్ గుడ్ మూవీ..ఫీల్ గుడ్ సాంగ్..
అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.