ఆదివారం, అక్టోబర్ 23, 2016

మల్లెల వానలా...

బాబు బంగారం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బాబు బంగారం (2016)
సంగీతం : జిబ్రాన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : నరేష్ అయ్యర్

మల్లెల వానలా మంచు తుఫానులా
ముంచేసిందే నీలొ మంచితనం
మనసే మనిషై ఇలా పుట్టెసిందే నీలా ఇలా
ముద్దొస్తుందే నీలో హ్యూమనిజం
అచ్చైపొయావే చిట్టి గుండె లోతులో
నచ్చావే తొట్ట తొలి చూపులో
నాకంటి కలకిపుడెన్ని రంగులో పడిపొయా నీ ప్రెమలో
చూస్తున్నా చూస్తున్నా ..ఆఆ.. నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా ..ఆఆ.. మనసే రాసిస్తున్నా

మల్లెల వానలా మంచు తుఫానులా
ముంచేసిందే నీలొ మంచితనం
నాకంటి కలకిపుడెన్ని రంగులో పడిపొయా నీ ప్రెమలో
చూస్తున్నా చూస్తున్నా ..ఆఆ.. నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా ..ఆఆ.. మనసే రాసిస్తున్నా

ఇన్నాళ్ళు ఏమయ్యవో ఏ దిక్కున దాక్కున్నావో
ఇవ్వాళే ఇంతందంగా నా కంట్లో పడ్డావో
పున్నమిలో పుట్టుంటావో వెన్నెల నీ పేరంటావో
ఆల్చిప్పల ముత్యంలాగా స్వచ్చంగా మెరిసావో
అందానికి హుందాతనం జంట చేరగా
దేవతలా నడిచొచ్చావు నేలబారుగా
ఆకర్షించావే కొత్తకోహినూరుగా నే ఫిదా అయా

నాలాగా నువ్వంటా ఆ..ఆ.. నీలాగ నేనంటా
అనుకోకున్నా ఇలా కలిసింది మన జంటా

నీ ఇంటి పేరే జాలి నీ మాటే చల్లగాలి
నీ కంటి చూపే నాకు రాగాల జోలాలి
నువ్వే నా దీపావళీ
నువ్వే నా రంగుల హోలీ
నా గుండెల్లోని ఖాళీ నీతోనే నిండాలి
సూర్యోదయాన సుబ్బలక్ష్మి పాటలా
మదర్ తెరెసా నోట మంచి మాటలా
చుట్టూ ముట్టావే నన్ను అన్ని వైపులా
నే ఫిదా అయా

మల్లెల వానలా మంచు తుఫానులా
ముంచేసిందే నీలొ మంచితనం
నాకంటి కలకిపుడెన్ని రంగులో పడిపొయా నీ మాయలో
చూస్తున్నా చూస్తున్నా ఆఅ.. నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా ..ఆఆ.. మనసే రాసిస్తున్నా


4 comments:

కొత్త సినిమాల్లో ఉన్న వినబుల్ పాటలు పోస్ట్ చేస్తున్నందుకు థాంక్సండీ..

థాంక్స్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ శాంతి గారు..


"వినబుల్ పాటలు" బాగుందండీ !

జిలేబి

థాంక్యూ..మీ తీయని మాటకి..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.