ఆదివారం, అక్టోబర్ 16, 2016

ఓ మనసా చేరువగా...

ఒక మనసు చిత్రం కోసం శ్రేయ ఘోషల్ అద్భుతంగా గానం చేసిన ఒక పాటను ఈ రోజు తలచుకుందాం.  ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఒక మనసు (2016)
సంగీతం : సునీల్ కశ్యప్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : శ్రేయ ఘోషల్

ఓ మనసా చేరువగా .. రా ఇలా
నను నీలో ఆపుతూ
వెళ్లిపొమ్మని తరిమేస్తావేలా
ఓ మనసా చేరువగా రా ఇలా

ఓ .. కాలాల చూపుసోకి వేరొక రూపులోకి
నాలోని ప్రేమరంగు మారిపోదుగా
నువ్వెంటో తెలిసినాక ఇందాక వచ్చినాక
నీ జంట జాడ తప్ప దారి లేదుగా

ఓ మనసా చేరువగా .. రా ఇలా
నను నీలో ఆపుతూ
వెళ్లిపొమ్మని తరిమేస్తావేలా
ఓ మనసా చేరువగా .. రా ఇలా

ఊహించనేలేనే ఉండనేలేనే
నువ్వు లేనిదే నేనెలా
నీతోనే నీలోనే కలిపేశా నన్నే
పో పొమ్మనీ అనకలా
ఏనాడో నువు కూడా నేనయ్యావుగా
నిను నువ్వే కాదని వెలివేసే వీలంటూ ఉందా

ఓ మనసా చేరువగా .. రా ఇలా

వద్దన్నానని వద్దకొచ్చాను
ఈ జీవితం నీదని
చేరాను నా తీరం మూసేసా ద్వారం
నా మాటనే విననని
ఒక జననం ఒకటేనా ప్రేమకు
తుదివరకూ నీ కలే
మరణము దరి రాదంటా తనకు

ఓ మనసా చేరువగా .. రా ఇలా
ఓ .. కాలాల చూపుసోకి వేరొక రూపులోకి
నాలోని ప్రేమరంగు మారిపోదుగా
నువ్వెంటో తెలిసినాక ఇందాక వచ్చినాక
నీ జంట జాడ తప్ప దారి లేదుగా
ఓ మనసా చేరువగా .. రా ఇలా


2 comments:

ప్చ్..ఇంత అందమైన పాటలున్న మూవీలో కధా పరం గా..హీరో యెంతో సెల్ఫిష్ గా..హీరోఇన్ అంత ఫూలిష్ గా ఉండటం(విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు నిహారిక యెండ్ నాగ శౌర్య ఫాన్స్) చాలా బాధ కలిగించింది..

ఈ సినిమా మీకు అస్సలు నచ్చలేదని అర్ధమవుతుందండీ :-)) థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.