శుక్రవారం, అక్టోబర్ 07, 2016

గౌరీ శంకర శృంగం...

మహాలక్ష్మీ దేవి అవతారంలో దర్శనమీయనున్న అమ్మవారికి నమస్కరించుకుంటూ ఈ రోజు మయూరి చిత్రం లోని ఒక చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మయూరి (1985)
సంగీతం : బాలు
సాహిత్యం : వేటూరి
గానం : జానకి

గౌరీ శంకర శృంగం
నరనారీ సంగమ రంగం
ఇది నటనకు సోపానం
కళలకు కళ్యాణం

గౌరీ శంకర శృంగం
నరనారీ సంగమ రంగం 
ఆఆఆఆ.. ఆఆఅ...
   
పాదపూజకై మందారమైనా
నాద మధువుతో మంజీరమాయె
దేవతార్చనకు ఏ కీర్తనైనా
జీవితాంతమీ రస నర్తనాయె
వాఙ్మయమే వచనం ఆంగికమే భువనం
వాఙ్మయమే వచనం ఆంగికమే భువనం
అకాశాలలో తారలన్నీ
ఆహార్యాలుగా అందుకుంటూ
కైలాసాల శిఖరాగ్రాలందు
కైవల్యాలు చవిచూసే వేళలో

గౌరీ శంకర శృంగం
నరనారీ సంగమ రంగం
ఆఆఆఆ.. ఆఆఅ...
  పడమటెండల పారాణి తూలె
సంధ్యారాగాలతో ఊసులాడే
కొలనులు నిదరోవు కార్తీక వేళ
కలువలలో తేనె గిలిగింతలాయె
సకల కళా శిఖరం నర్తనమే మధురం
సకల కళా శిఖరం నర్తనమే మధురం
కాశ్మీరాలలో పూల గంధం
కేదారాలలో సస్యగీతం
శివలాస్యాల శృంగారాలెన్నో
అంగాంగాల విరబూసే వేళలో

గౌరీ శంకర శృంగం
నరనారీ సంగమ రంగం
ఇది నటనకు సోపానం
కళలకు కళ్యాణం
 
గౌరీ శంకర శృంగం
నరనారీ సంగమ రంగం 
ఆఆఆఆ.. ఆఆఅ...
 

2 comments:

ఈ మూవీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది కదండీ.

అవును శాంతి గారు వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.