మిత్రులందరకూ దీపావళి శుభాకాంక్షలు. పందెంకోడి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్లు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పందెం కోడి (2006)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : రఘు కుంచె, నాగ సాహితి, నాగ స్వర్ణ
ఓణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి
చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి
ఆటే దాగుడుమూత తన పాటే కోయిల కూత
మనసే మల్లెల పూత ఆ పరువం దోచుకుపోతా
రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే
ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే
ముచ్చట ముచ్చట ముద్దూముచ్చట ఆడుకోవాలి
అచ్చికబుచ్చికలాడుకుంటు కలుసుకోవాలి
వెచ్చగ వెచ్చగ వయసు విచ్చెను పుచ్చుకుపోరా కమ్మగా
రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే
ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే
అందమిది అందమిది వచ్చే పందెంకోడిలా
పొంగినది పొంగినది పచ్చి పాల ఈడులా
సందెపొద్దు వేళలోన సన్నజాజి పువ్వులా
అందమంత ఆరబోసి నీకు హారతివ్వనా
వచ్చే వచ్చే వలపే నా మనసులోని పులుపే
ఆశ పడ్డ తలపే నా ఎదలో మోజు తెలిపే
ఇంతకుమించి ఇంతకుమించి ఏదో ఏదో ఉందిలే
కలికి కులుకు తళుకుబెళుకులొలుకుతున్నాది
ఆ చిలక బుగ్గ మొలక మొగ్గ విచ్చుకున్నాది
కన్నె ఇది కన్నె ఇది కన్ను కొట్టమన్నది
వన్నె ఇది వన్నె ఇది వెన్ను తట్టమన్నది
పరికిణి కట్టుకు వచ్చెను పరువాల జాబిల్లి
పదునైన సోకుగని ఎదకేదో ఆకలి
కనులు పాడే జోల ఇది దేవలోక బాల
కలలు కనే వేళ ఇది కలువ పూల మాల
ఏటవాలు చూపులేసి లాగింది నా గుండెని
కంది చేను చాటుకొస్తే కలుసుకుంటాలే
ఈ అందగాడి ఆశలన్ని తెలుసుకుంటాలే
ఓణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి
చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి
ఆటే దాగుడుమూత..తన పాటే కోయిల కూత
మనసే మల్లెల పూత...ఆ పరువం దోచుకుపోతా
ముచ్చట ముచ్చట ముద్దూముచ్చట ఆడుకోవాలి
అచ్చికబుచ్చికలాడుకుంటు కలుసుకోవాలి
వెచ్చగ వెచ్చగ వయసు విచ్చెను
పుచ్చుకుపోరా కమ్మగా
రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే
ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే
రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే
ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.