ఆదివారం, అక్టోబర్ 09, 2016

నాద వినోదము నాట్య విలాసము...

దుర్గాదేవి అవతారంలో భక్తులను కరుణించనున్న దుర్గమ్మను మనసారా స్మరిస్తూ ఈ రోజు సాగరసంగమం చిత్రం లోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సాగర సంగమం (1982)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, ఎస్. పి. శైలజ

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !!
వందే పార్వతీప రమేశ్వరౌ

నాద వినోదము నాట్య విలాసము
పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము
సలుపు పరమ పదమూ
భావములో ఆ.. భంగిమలో ఆ..
గానములో ఆ.. గమకములో ఆ...
భావములో భంగిమలో
గానములో గమకములో
ఆంగికమౌ తపమీ గతి సేయగ

నాదవినోదము నాట్యవిలాసము
పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము
సలుపు పరమ పదమూ
ఆ..ఆ..ఆ.........
 
ని ని మ ద ని ని.. ని.. మ ద ని స ని.. ని.. 
రి స ని ద ని.. ని  
మ గ మ ద ద  గ మ మ రి గ స 

కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
 
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
నవరస నటనం .. ద ని స రి స ని స
జతియుత గమనం .. ద ని స రి స ని స
నవరస నటనం జతియుత గమనం
సితగిరి చలనం సురనది పయనం 

భరతమైన నాట్యం .. ఆ...
బ్రతుకు నిత్య నృత్యం ..
ఆ...
భరతమైన నాట్యం .. ఆ...
బ్రతుకు నిత్య నృత్యం ..
ఆ...
తపనుని కిరణం తామస హరణం
తపనుని కిరణం తామస హరణం
శివుని నయన త్రయలాశ్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన నాట్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన లాస్యం
నమక చమక సహజం ..ఝం
నటప్రకృతీ పాదజం .. ఝం
నర్తనమే శివకవచం .. చం 
నటరాజ పాద సుమరజం .. ఝం
ధిరనన ధిరనన ధిరనన ధిరనన
ధిర ధిర ధిర ధిర ధిర ధిర..

నాదవినోదము నాట్యవిలాసము
పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము
సలుపు పరమ పదమూ

 

2 comments:

మీకు మీ కుటుంబ సభ్యులకీ దుర్గాష్టమి శుభాకాంక్షలు వేణూజీ..

థాంక్స్ శాంతి గారు.. మీకు కూడా పండగ శుభాకాంక్షలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.