లేటెస్ట్ హిట్ ప్రేమమ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ప్రేమమ్ (2016)
సంగీతం : రాజేష్ మురుగన్
సాహిత్యం : శ్రీమణి
గానం : విజయ్ ఏసుదాస్
తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే
నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే
పొలమారితె నీ మనసుకి అది నా పొరపాటే
నీ పేరే పలకడమే పెదవులకలవాటే
వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నామాటే
ఎవరే.. ఎవరే ప్రేమను మాయంది..
ఎవరే.. ఈ హాయికి హృదయము చాలందీ..
ఎవరే నిన్నే నా వైపు నడిపే
నా ఊహల మధురోహల హరివిల్లు నింపే
తియ్య తియ్యని నిముషాలే నీలోన ఒంపే
నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే..
ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో
నీ చిన్ని చిరునవ్వె విలువైన వరమంటూ
నా ప్రాణమే నీకు చెబుతోంది ఇపుడూ
నువు లేక నే లేననీ ..
గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే
దాచేయాలనుకుంటే అది నా అత్యాశే
అడుగంత దూరం నువు దూరమైనా
నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే..
ఎవరే..
వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నామాటే
ఎవరే.. ఎవరే ప్రేమను మాయంది..
ఎవరే.. ఈ హాయికి హృదయము చాలందీ..
ఓఓ...ఓఓఓ...ఓఓఓ...ఓఓ...
2 comments:
ఈ మూవీలో గుండె కొచ్చి చుట్టుకుది సాంగ్ చాలా నచ్చిందండి..వీలైతే వేయగలరు..
అవునండీ ఆ పాట కూడా చాలా బాగుంది ఖచ్చితంగా త్వరలో వేస్తాను శాంతి గారూ. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.