శనివారం, అక్టోబర్ 22, 2016

తాను నేను...

నాగచైతన్య గౌతమ్ మీనన్ కాంబినేషన్లో రానున్న సాహసం శ్వాసగా సాగిపో చిత్రం లోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సాహసం శ్వాసగా సాగిపో (2016)
సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : అనంత్ శ్రీరామ్
గానం : విజయ్ ప్రకాష్

తాను నేను మొయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేనూ పైరు చేను
తానూ నేనూ వేరు మాను
శశి తానైతే నిశినే నేనూ
కుసుమం తావి తానూ నేను
వెలుగు దివ్వె తెలుగు తీపి
తానూ నేనూ మనసు మేను

దారి నేను తీరం తాను
దారం నేను హారం తాను 
దాహం నేను నీరం తాను
కావ్యం నేను సారం తాను
నేను తాను రెప్ప కన్ను
వేరైపోని పుడమి మన్ను
నేను తాను రెప్ప కన్ను
వేరైపోని పుడమి మన్ను

తాను నేను మొయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను గానం గమకం
తాను నేను ప్రాయం తమకం. 

తాను నేను మొయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేనూ పైరు చేను
తానూ నేనూ వేరు మాను
శశి తానైతే నిశినే నేనూ
కుసుమం తావి తానూ నేను
వెలుగు దివ్వె తెలుగు తీపి
తానూ నేనూ మనసు మేను 
మనసు మేను మనసు మేను 


7 comments:

మనసుతో వింటే చాలా అందమైన పాట..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

అద్భుతమైన సాహిత్యం.... మొయులు, తావి పదాల అర్ధం ఎవరైనా తెలుపగలరు.

థాంక్స్ ఫర్ ద కామెంట్ గౌరీ శంకర్ గారు...
మొయిలు అంటే మేఘం అండీ, తావి అంటే పరిమళం.

ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. సాహిత్యాన్ని పొందుపరచడం ద్వారా మా చెంతకు చేర్చినందుకు మరియు అర్థం తెలుపడం ద్వారా మా మనసుల్లోనికి చేర్చినందుకు.

థాంక్యూ సో మచ్
మంచి పాట

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అజ్ఞాత గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.