శనివారం, అక్టోబర్ 01, 2016

బ్రహ్మాంజలి...

ఈ రోజునుండీ దేవీ నవరాత్రులు మొదలవనున్నాయి. ఈ ఏడు దుర్గమ్మ పదకొండు రోజుల పాటు పదకొండు అవతారాలలో దర్శనమీయనుంది. ఈ పదకొండు రోజులూ అమ్మవారికి నాట్యాంజలి ఘటిస్తూ నాట్యప్రధానమైన పాటలను తలచుకుందాం. తొలిరోజైన నేడు స్వర్ణకవచాలంకృతాదేవి కి నమస్కరిస్తూ ఈ బ్రహ్మాంజలి పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడచ్చు.


చిత్రం : ఆనందభైరవి (1983)
సంగీతం : రమేష్ నాయుడు 
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు

గురుర్ బ్రహ్మ గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మః
తస్మైశ్రీ గురవేన్నమః

సముద్ర వసనే దేవీ
పర్వత స్తన మండలే
నాట్యం కరిష్య భూదేవీ
పాదఘాతం క్షమస్వమే

బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు
దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు
బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు
దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు బ్రహ్మాంజలీ

భక్త్యంజలి సిద్ధయోగీంద్ర సత్కవికి
భక్త్యంజలి సిద్ధయోగీంద్ర సత్కవికి
నృత్యాంజలి నాట్య కోవిద వరులకు
నృత్యాంజలి నాట్య కోవిద వరులకు

బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు
దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు బ్రహ్మాంజలీ

శుభము శుభము సాహిత్య పరులకు
శుభము శుభము సంగీత విదులకు
శుభము శుభము నాట్యానుమోదులకు
శుభము శుభము సర్వ జనాళికీ
శుభము శుభము నాట్యానుమోదులకు
శుభము శుభము సర్వ జనాళికీ

బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు
దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు బ్రహ్మాంజలీ 


2 comments:

మీ కుటుంబానికి స్వర్ణ కవచాలంకృతా దేవి కటాక్షం సిద్ధించాలని ఆశిస్తున్నాము వేణూజీ..

థాంక్స్ శాంతి గారు మీక్కూడా ఆ దేవి ఆశీస్సులు పుష్కలంగా లభించాలని కోరుకుంటున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.