సుప్రీమ్ సినిమాలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. రాజ్ కోటి స్వరపరచిన అందం హిందోళం పాటకు చక్కని రీమిక్స్ అందించిన సాయి కార్తీక్ అభినందనీయుడు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : సుప్రీమ్ (2016)
సంగీతం : సాయి కార్తీక్
సాహిత్యం : వేటూరి
గానం : రేవంత్, చిత్ర
అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ.. అందాలనేది.. అందగనే.. సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెను లే..
అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
చలిలో దుప్పటి కెక్కిన ముద్దుల పంటలలో
చలిగా ముచ్చటలాడిన ఉక్కిరిగుంటలలో...
దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మెళ్ళెకాయగా
పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా
ఉసిగొలిపే.. రుచితెలిపే.. తొలివలపే.. హా
మొటిమలపై మొగమెరుపై జతకలిపే.. హా..
తీయనిది.. తెర తీయనిది...
తీరా అది చేజిక్కినది..
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే..హోయ్
అందం హిందోళం అ.. ఆహ...
అధరం తాంబూలం.. అ.. ఆహ..
అసలే చలికాలం త.. త్తర
తగిలే సుమ బాణం
వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
గిచ్చుళ్ళ వీణమీద మృదులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయిమీద నిదరంత మాయగా
తొలి ఉడుకే ఒడిదుడుకై చలిచినుకై.. హా
పెనవేసి పెదవడిగే ప్రేమలకూ..హై
ఇచ్చినదీ.. కడు నచ్చినదీ
రేపంటే నను గిచ్చినదీ
అక్కరకొచ్చిన చక్కని సోయగమే.. హే..
అందం హిందోళం అ.. ఆహ...
అధరం తాంబూలం.. అ.. ఆహ..
అసలే చలికాలం ఎ.. ఎహే
తగిలే సుమ బాణం అ.. ఆహా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.