పెళ్ళిచూపులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పెళ్ళిచూపులు (2016)
సంగీతం : వివేక్ సాగర్
సాహిత్యం : శ్రేష్ట
గానం : అమృతవర్షిణి
చినుకు తాకే జడిలో
చిగురు తొడిగే చెలిమే
విరిసె హరివిల్లులే
ఎదుట నిలిచే నిజమే
కలలు పంచె తీరే
చెలికి చిరునవ్వులే
మునుపు కనుగొనని ఆనందమేదో
కలిగే నాలోన ఈ వేళనే
ఎగిసి ఉప్పొంగే ఊహల్లో మునిగీ ఉన్నాలే
పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా
కలవరింతే తరిమే పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదెలా
నాలో నే దాగి నిదురించు నన్నే
తట్టి లేపింది నీవే సుమా
ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా
నేనేనా ఇది అంటూ అనిపించినా
ఔనౌను నేనే మరి కాదా
చిత్రంగా నాకేనే కనిపించినా
కవ్వించే చిత్రాన్నయ్యాగా
నా దారినే మళ్లించిన తుళ్లింతలా వరదలా
పాదాలనే నడిపించిన రహదారి వయ్యావేల
నేరుగా సరాసరి నేనిలా
మారగా మరీ మరీ తీరుగా
పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా
కలవరింతే తరిమే పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదెలా
నాలోనే దాగి నిదురించు నన్నే
తట్టి లేపింది నీవే సుమా
ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా
2 comments:
చక్కని సాహిత్యం..డామినేట్ చేయక సాగే సంగీతం ఉన్న పాటలు యే రోజుల్లోవైనా హాయిగా ఉంటాయి కదండీ..
అవును శాంతి గారూ అలా అన్ని చక్కగా అమరిన సినిమా పెళ్ళిచూపులు.. ఈ సినిమా కూడా బాగుంటుంది. థాంక్స్ ఫర్ ద కామెంట్ :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.