మంగళవారం, అక్టోబర్ 11, 2016

ఆరు ఋతువుల...

మిత్రులందరకూ దసరా శుభాకాంక్షలు. ఈ విజయదశమి పర్వదినాన రాజరాజేశ్వరీ దేవి అవతారంలో దర్శనమిచ్చే దుర్గమ్మకు మనసారా నమస్కరించుకుంటూ ఆలాపన చిత్రంలోని ఈ చక్కని పాట తలచుకుందాం.ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆలాపన (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఆరు ఋతువుల భ్రమణమున్నా అఖండం కాలాత్మా
ప్రకృతీ పురుషుల మిధునమున్నా అతీతం పరమాత్మా
ఎన్ని బహుముఖ రీతులున్నా 
ఏకం తదేకం రసైకం నాట్యాత్మా
 
తాం ధీం తోం తక్కిట తకధిమి తకఝణు తకధీం
తోం నం ధీంకిట తకధిమి తకఝణు తక ధిధిత్తాం
తకతకిట తకధిమి ధింతత్తాం తకతకిట తకధిమి
తక్కిటతక తోంకిటతక నంకిటతక 
ధీంకిటతక తరికిట తరికిట
తక్కిటతక తోంకిటతక నంకిటతక 
ధీంకిటతక తరికిట తరికిట త
తధిత్తరికిట తోంకిట నంకిట
ధిత్తరికిట తోంకిట నంకిట
తధిత్తరికిట తోంకిట నంకిట
తధిత్తరికిట తోంకిట నంకిట
ధిత్తరికిట తోంకిట నంకిట
తధిత్తరికిట తోంకిట నంకిట
తధిత్తరికిట తోంకిట నంకిట థం

నటరాజు నయనాలు దీవించగ
ఆ నటరాజు నయనాలు దీవించగా
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన
నాట్య సుధానిధి అర్పించనా
నటరాజు నయనాలు దీవించగ
ఆ నటరాజు నయనాలు దీవించగా

తకధిమితాం కిటతకథాం తకథజం 
ధిమిథజం జనుథజం తరికిటతకథాం
 
నిలువెల్ల తులలేని తుదిలేని జాలి
నెలకొన్న లలితేందు మౌళీ
నిలువెల్ల తులలేని తుదిలేని జాలి
నెలకొన్న లలితేందు మౌళీ
గళసీమ నాగేంద్ర హారావళీ
తన కీర్తి తారావళి ఆఆఅ...
గళసీమ నాగేంద్ర హారావళీ
తన కీర్తి తారావళి ఆఆఆ...
నగములదర నభములదర 
జలధులెగుర జగతిచెదర
హరహరయని సురముని తటికుదువ
ధీంగినతోం తధీంగినతోం తధీంగినతోం

నటరాజు నయనాలు దీవించగ
ఆ నటరాజు నయనాలు దీవించగా
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన
నాట్య సుధానిధి అర్పించనా
నటరాజు నయనాలు దీవించగ
ఆ నటరాజు నయనాలు దీవించగా

తకధిమి తకఝణు తకిటతంతం 
త్రిభువన భూర్నిత ఢమరునాదం
ఝణుతక ధిమితక కిటతధీంధిం 
ముఖరిత రజత గిరీంద్రమూర్ధం
తకిట తంతం చలిత చరణం 
ఝణుత తంతం జ్వలిత నయనం
తకిటధీం లయధరం తకిటధీం భయకరం
తకిటధీం లయధరం తకిటధీం భయకరం
తకిటధీం లయధరం భయకరం
చండ విజ్రుంభిత శాంభవ బింబం 
శైలసుతా పరితోషిత రూపం

ఘణ ఘణ ఘణ ఘణ ఘణ 
ఘణ ఘణ ఘణ యఘణధం
ధన ధన ధన ధన ధన ధన 
ధన ధన తగనఝం
యనగణ ధనఘణ పఘణఝం
యనగణ పనఘణ రగణఝం
యగణమగణం జగణగగణం
ఖగణపగణం రగణజగణం
యగమగ జగగణ తగఫగ రగజణ
యగణ మగణ జగణ ఖగణ ఫగణ గఝం

నగరాజ నందిని అభవార్ధ భాగిని
నగరాజ నందిని అభవార్ధ భాగిని
రుధిరాప్థ జిహ్వికా రూక్షరుద్రాక్షిక
రుధిరాప్థ జిహ్వికా రూక్షరుద్రాక్షిక
క్షుద్రప్రణాశిని భద్రప్రదాయిని
క్షుద్రప్రణాశిని భద్రప్రదాయిని
మదమోహ కామప్రమత్త దుర్ధమచిత్త 
మహిష రాక్షసమర్ధినీ
మహిషరాక్షసమర్ధినీ 
మహిషరాక్షసమర్ధినీ


2 comments:

వేణూజీ మీ నృత్యారాధన ముగింపు చాలా అద్భుతమైన పాటతో చేశారే.. దసరా శుభాకాంక్షలు వేణూజీ..

థాంక్స్ శాంతి గారు మీకు కూడా దసరా శుభాకాంక్షలు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.