జంధ్యాల గారి సినిమాలలో నవ్వులు ఎంత బాగుంటాయో పాటలు అంతే బాగుంటాయి. కామెడీ సినిమాకి పాటలేంటిలే అని ఈరోజుల్లోలా లైట్ తీస్కోకుండా తన ప్రతిసినిమాలోనూ పాటలకు చాలా ప్రాముఖ్యతనిచ్చి మంచి మెలోడీలు చేయించుకునేవాళ్ళు జంధ్యాలగారు. శ్రీవారి శోభనం అనే సినిమాలో "చంద్ర కాంతిలో" అనే ఈ పాట కూడా అటువంటిదే.
కథానయికను నదులతో పోలుస్తూ అందంగా సాగే వేటూరి గారి సాహిత్యం రమేష్ నాయుడిగారి సంగీతం బాలు గారి స్వరం వెరసి ఈ పాటకు తేనెలాంటి కమ్మదనాన్ని అద్ది ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టకుండా చేస్తుంది. ఈ పాట వీడియో మీకోసం... ఆడియో మాత్రమే వినాలంటే పై ప్లగిన్ లో లేదా చిమటాలో ఇక్కడ వినండి. ఇదే సినిమాలోని మరో పాట “అలక పానుపు ఎక్కనేల” గురించి ఇదివరకు రాసిన పోస్ట్ ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రీవారి శోభనం
సాహిత్యం : వేటూరి
సంగీతం : రమేష్ నాయుడు
గానం : బాలు
చంద్ర కాంతిలో చందన శిల్పం..
చంద్ర కాంతిలో చందన శిల్పం..
స్వర శ్రుతి లయలా మణిహారం..
గేయమంటి నీ సోయగమంతా కవినై పాడుదునా..
చూపుల చలితో ఊహల ఉలితో చెలి నిను తాకుదునా..
చెలి నిను తాకుదునా..
చంద్ర కాంతిలో చందన శిల్పం..
స్వర శ్రుతిలయలా మణిహారం..
చంద్ర కాంతిలో చందన శిల్పం..
తరగలా నవ్వులా నురగలా మువ్వలా
పరుగుల పల్లవితో ఉరవడి ఊహలతో
రాలకు సైతం రాగం నేర్పే రాయల నాటి తుంగభద్రవో
శ్రీనాధుడికే శృంగారాలను నేర్పిన వాణివి కృష్ణవేణివో
ప్రణయ కవన సుందరీ.. దేశి కవితలో తేనెగ పొంగుదునా
నీ పద లయలో నీ అందియనై పదములు కడుగుదునా..
పదములు కడుగుదునా...
చంద్ర కాంతిలో చందన శిల్పం..
స్వర శ్రుతిలయలా మణిహారం..
చంద్ర కాంతిలో చందన శిల్పం..
వెన్నెలా కుంచెలా.. చీకటీ రేఖాలా
పండిన కుంకుమతో పచ్చని శోభలతో
రాముని పదముల నాదమై ఎగసీ నదిగా మారిన గౌతమివో
తెలుగు పాటకీ తెలుగు మాటకీ వెలుగు చూపినా వంశధారవో
వెలుగు నీడలే ఏడు రంగులై వేణువులూదుదునా..
పుత్తడి బొమ్మకు పున్నమి రెమ్మకు కౌగిలి పట్టుదునా..
కౌగిలి పట్టుదునా..
చంద్ర కాంతిలో చందన శిల్పం..
స్వర శ్రుతిలయలా మణిహారం..
4 comments:
superb song venugaaru...one of my most favourite songs..
థాంక్స్ తృష్ణ గారు :-)
పగలే వెన్నెలాయే..థాంక్యూ వేణూజీ..
థాంక్స్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.