బుధవారం, జనవరి 29, 2014

హలో హల్లో ప్రేమలేఖా

ఒకప్పుడు సందేశాలు అందించేందుకు పావురాలను, ఆ తర్వాత గుర్రాలపై వెళ్ళి సందేశాలను అందించే వేగులను, ఆ తర్వాత ఉత్తరాలను చేర్చే పోస్టల్ వ్యవస్థను, అటుపై టెలిగ్రాములను వాటితర్వాత వచ్చిన టెలీఫోనులను, ఈ మెయిల్స్ నూ, ఇప్పటి సెల్ఫోన్సూ, వాట్సాప్ లాంటి మెసెంజెర్స్ ఎట్సెట్రాలనన్నిటినీ ప్రేమ సందేశాలను అందించడానికి వాడుకున్నారు ప్రేమికులు. ఫోన్లు బాగా పాపులర్ అయిన టైమ్ లో ఉన్న ఈ ప్రేమికుడిని చూడండి, ప్రేయసితో డైరెక్ట్ గా మాటాడే ఛాన్స్ కోసం ఏకంగా ఫోను చేసేసి ప్రేమలేఖ రాయలేక ఫోను చేశాను అని అందమైన ఆబద్దం అంతే అందమైన పాట రూపంలో చెప్పేస్తున్నాడు తన ప్రేయసికి, ఆ కథా కమామిషూ ఏవిటో మీరు కూడా వినండి మరి. ఈ పాట వీడియో వెతికే సాహసం చేయలేకపోయాను ఆడియో క్రింది ప్లగిన్ పని చేయకపోతే ఇక్కడ ప్రయత్నించండి.చిత్రం : గ్యాంగ్ మాస్టర్ (1994)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

హలో హల్లో ప్రేమలేఖా ఫోను చేశా రాయలేకా 
L O V E లవ్ టెల్ మి అది హౌ
లైనేసిన లవ్.. ఎల్ బోర్డిది నౌ
చెలి ఫోనిది మారెను పోను పోను ఓ ప్రేమ ట్యూనుగా హయ్..
హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక

అందె నాకు లేఖా చందమామ కేక నన్నింక కవ్వించక
తోటలోని రోజా తోటమాలి పూజ వేళాయే వేధించక
ఈ దూరమే మధురం నీ ఫోను అధరం
సన్నాయి ముద్దుల్లో అమ్మాయి ప్రేమల్లో
అందాల వాణి విన్నాను ఈ వేళ

హలో హల్లో ప్రేమలేఖా ఫోను చేశా రాయలేక
L O V E లవ్ టెల్ మి అది హౌ
లైనేసిన లవ్ ఎల్ బోర్డిది నౌ  
చెలి ఫోనిది మారెను పోను పోను ఓ ప్రేమ ట్యూనుగా హోయ్
హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక

అర్దరాత్రి దాకా నేను ఆగలేక కొట్టాను లవ్ గంటలే
తెల్లవారేదాకా తేనె విందు లేక కోరాను నీ జంటనే
రాశాను లవ్ లెటరే ఓహ్హో..ఓఓ.. అందాల అడ్రస్ కే
చిన్నారి సిగ్గుల్లో శృంగార తెలుగుల్లో
ఆకాశవాణి చెప్పిందీ శుభవార్త

హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక
L O V E లవ్ టెల్ మి అది హౌ
లైనేసిన లవ్ ఎల్ బోర్డిది నవ్
చెలి ఫోనిది మారెను పోను పోను ఓ ప్రేమ ట్యూనుగా

హలో హల్లో ప్రేమలేఖా ఫోను చేశా రాయలేక
L O V E లవ్ టెల్ మి అది హౌ
లైనేసిన లవ్ ఎల్ బోర్డిది నవ్
చెలి ఫోనిది మారెను పోను పోను ఓ ప్రేమ ట్యూనుగా
హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక

2 comments:

నువ్వు యూత్ యెంట్రా బాబూ అనిపించే రాజశేఖర్ ని మినహాయిస్తే, ఈ పాట చాలా బావుంటుంది..యూ ఆర్ టూ ఇంటెలిజెంట్ వేణూజీ(సాహసం చేయనందుకు)..

థాంక్స్ శాంతి గారు :-) హహహ వద్దులెండి రాజశేఖర్ గురించి నో కామెంట్స్ :-)) కొన్ని పాటలంతేనండీ వీడియో కన్నా ఆడియో వినడమే సుఖం.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.