రహమాన్ సంగీతంతో శంకర్ దర్శకత్వంలో ప్రేమికుడు సినిమాకోసం చేసిన "అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే" అనే ఈ ప్రేమపాటలో ప్రేయసి ఎంత అపురూపమో కుర్రకారుకి సులువుగా అర్ధమయేలా చాలా సాధారణమైన భాషలో చెప్పే ప్రయత్నం చేశారు రాజశ్రీ. బాలు ప్రభుదేవాల డాన్స్ బిట్స్ తో ఈ పాట చిత్రీకరణ కూడా సరదాగా ఉంటుంది. ఈ చక్కని పాట మీకోసం :-) ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.
చిత్రం : ప్రేమికుడు (1994)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : ఉదిత్ నారాయణ్, బాలు, ఎస్. పి. పల్లవి
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..
సత్తురేకు కూడా స్వర్ణమేలే..
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై..
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే..
ఊహూ..భూమికే భూపాలమే
వయసుల సంగీతమే..
ఊహూ..భూమికే భూపాలమే...
సానిసా సారిగారి సానిసానిసాని
సానిసా సాగమామపమాగారీస
సానిసా సారిగారినీ సానిపానిసానిసా
సాగమమమ మాప మాగరీస
అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో..
పిచ్చిరాతలైన కవితలవునులే
ప్రేమకెపుడు మనసులోన భేదముండదే...
ఎంగిలైన అమృతమ్ములే..
బోండుమల్లి ఒక్క రూపాయి..
నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు
పీచు మిఠాయ్ అర్దరూపాయి..
నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు
ఉహు..ఉహు...ఉం..ఉం..ఉహు..ఉమ్మ్..
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..
సత్తురేకు కూడా స్వర్ణమేలే..
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై..
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం...
ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే..
ఊహూ..భూమికే భూపాలమే
వయసుల సంగీతమే..
ఊహూ..భూమికే భూపాలమే...
ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే..
రాహుకాలం కూడా కలిసి వచ్చులే
ప్రేమ కొరకు హంస రాయబారమేలనే..
కాకి చేత కూడా కబురు చాలులే
ప్రేమ జ్యోతి ఆరిపోదే..
ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే
ఇది నమ్మరానిది కానెకాదే..
ఈ సత్యం ఊరికీ తెలియలేదే
ఆకసం భూమి మారినా మారులే..
కానీ ప్రేమ నిత్యమే
ఆది జంట పాడిన పాటలే..
ఇంకా వినిపించులే
ప్రేమ తప్పు మాటని...
ఎవ్వరైన చెప్పినా
నువ్వు బదులు చెప్పు మనసుతో..
ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు
అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా..
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
ఇదే సినిమాలోని మరో చక్కని ప్రేమ పాట ఓ చెలియా నా ప్రియ సఖియా అది కూడా ఇక్కడ చూడండి. ఆడియో ఇక్కడ వినవచ్చు.
చిత్రం : ప్రేమికుడు (1994)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : రాజశ్రీ
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : ఉన్నికృష్ణన్
ఓ చెలియా ..నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే..
ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే...
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే...ఏ..
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే..ఏ..
నా గుండెలలో ప్రేమ పరవశమై.. ఇరు కన్నులు సోలెనులే..ఏ..
ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే...
ఈ పూటా .. చెలి నా మాటా .. ఇక కరువై పోయెనులే
అధరము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే...
వీక్షణలో.. నిరీక్షణలో.. అర క్షణ మొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే...
ఇది స్వర్గమా..నరకమా...ఏమిటో తెలియదులే
ఈ జీవికీ...జీవనమరణమూ...నీ చెతిలో ఉన్నదిలే..ఏ..ఏ...
ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే
కోకిలమ్మా నువు సై అంటే...నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకుని...సవరించేను నీ కురులే..ఏ..
వెన్నెలమ్మా నీకు జోల పాడీ...కాలి మెటికలు విరిచేనే..ఏ..
వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే...ఏ..
నా ఆశలా ..ఊసులే ..చెవిలోన చెబుతానే...
నీ అడుగులా ..చెరగని గురుతులే ..ప్రేమ చరితను అంటానే

6 comments:
Renduu manchi songs..o cheliya songlo music chaala nacchutundi ..radhika
థాంక్స్ రాధిక గారు :)
IMO, the most beautiful song with respect to melody and picturization from AR Rahman is "Paruvam vanaga" from Roja.
The other two that top my romantic songs list are "Neeve amaraswarame" from Gharshana and "Om namaha" from Geetanjali.
$iddharth
బాగా చెప్పారు సిద్దార్థ్ గారు మూడిటికి మూడూ సూపర్బ్ సాంగ్స్..
ప్రభుదేవా బాడీ లో మ్యూజిక్ వుంటే కళ్ళలో మ్యాజిక్ వుంటుంది..ఒక నిమిషం అమాయకమైన ఇన్నోసెన్స్ అంతలోఅనే గుండెని లాగేసే మిస్చీవియస్ షార్ప్ నెస్స్ ఆయనకి మాత్రమే సాధ్యమయ్యే ఎక్స్ ప్రెషన్స్ అనిపిస్తుంది వేణూజీ....
థాంక్స్ శాంతి గారు.. ప్రభుదేవా గురించి ఇలాంటి కామెంట్స్ ఫస్ట్ టైమ్ వింటున్నానండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.