గురువారం, జనవరి 16, 2014

మానసవీణ మధుగీతం

వేటూరి గారి సాహిత్యమా.. రాజన్ నాగేంద్ర గార్ల సంగీతమా, బాలు సుశీల స్వరమాధుర్యమా ఈ పాటలో ఏది గొప్పగా ఉందని అడిగితే తేల్చి చెప్పగల తెలుగు వారుంటారంటారా... ఇలాంటి అద్భుతమైన పాటలను విని తనువు మనసూ పులకింపచేసుకోవడం తప్ప ఏమని భాష్యం చెప్పగలం చెప్పండీ.. మీరూ చూసి విని ఆనందించండి ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు.
 


చిత్రం : పంతులమ్మ (1977)
సాహిత్యం : వేటూరి
సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం : బాలు, సుశీల

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
 
మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం
సాగర మధనం..అమృత మధురం
సంగమ..సరిగమ..స్వరపారిజాతం
మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం
సంసారం...సంగీతం...


ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయపరాగం
అ..అ..అ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.

అ..అ..అ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.
ఆ ఆ..అ అ ఆ..అ అ అ ఆ..ఆ ఆ
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయపరాగం

ఎదలోయలలో నిదురించిన
నా కోరిక పాడే కోయిల గీతం
 

శతవసంతాల...దశదిశంతాల
సుమసుగంధాల...భ్రమరనాదాల
కుసుమించు నీ అందమే..
విరిసింది అరవిందమై
కురిసింది మకరందమే..

మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం
సంసారం...సంగీతం...


జాబిలి కన్నా నా చెలీ మిన్నా..
పులకింతలకే పూచిన పొన్న..
కానుకలేమి నేనివ్వగలనూ..
కన్నుల కాటుక నేనవ్వగలనూ..
పాలకడలిలా వెన్నెల పొంగింది
పూలపడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చేరగలనూ..
మనసున మమతై కడతేరగలనూ...

ఆ...గగసరి గపదప మమ గగ రిరి సస సరిసగమ
రిమగపదప మరిమరి సస రి..గస స..పద ద..పద ద ప..

మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం
సంసారం...సంగీతం...


ఆ..ఆఆ...ఆ..ఆ.. నిరిగమదా మగరినీ..
దనినీ..నిదమా..ఆ ఆ ఆ...ఆ ఆ అ ..
నిని రిరి గగ మమ దద

దద నిని రిరి గగ మమ
మమ దద నిని రిరి గగగ
కురిసే దాకా అనుకోలేదూ శ్రావణ మేఘమని
ఆ ఆ అ.. తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమనీ
ఆ ఆ.. కలిసేదాకా అనుకోలేదు తీయనీ స్నేహమనీ
సనిరిసని..ని ని ని..
నిని నిని నిని దని దనిద మద సస స
మగదమగ మగ మాగ
గాద మగ మగ..నీమగామ దప..దగరిగ రిగ..దనినిరి నిరి
ఆ ఆ అ అ...
ఆ ఆ అ అ..
ఆ ఆ ఆ అ అ అ ఆ ఆ..
మా...రిమగదప రిమరి..సరిమరి సరిసద..ససరి సరిమ..
పెదవినేనుగా..పదము నీవుగా..ఎదను పాడని
మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం
సాగర మధనం..అమృత మధురం
సంగమ..సరిగమ..స్వరపారిజాతం


Lyrics collected with corrections from http://swaraala-pallaki.blogspot.in/2013/08/blog-post_5321.html

4 comments:

"కానుకలేమి నేనివ్వగలనూ..
కన్నుల కాటుక నేనవ్వగలనూ."

అద్భుతమైన అభివ్యక్తి...
ఈ పాట తెలుసు కానీయండి, గోడపటం చూడటం ఇదేప్రధమం .. చూసి ఉలిక్కి పడ్డాను.. వీడియో లంకె నొక్కే సాహసం చేయను..

హహహ ఊకదంపుడు గారూ :-) థాంక్స్...

సెన్షువల్ ప్రెజెంటేషన్ ఆఫ్ యెక్స్టాటిక్ లవ్..ఆత్రేయ గారు మనసు కవైతే, మన వేటూరి వారు ఖండితం గా మధుర కవే ..

థాంక్స్ శాంతి గారు.. మనసు కవి మధుర కవి కరెక్ట్ గా చెప్పారు :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.