సోమవారం, జనవరి 06, 2014

యమునా తీరమున సంధ్యా సమయమున

పెండ్యాల గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన అలనాటి మ్యూజికల్ హిట్ చిత్రం "జయభేరి" లోని ఈ పాట నాకు ఇష్టమైన మరో కృష్ణుని పాట. ఘంటసాల గారు మాంచి బేస్ వాయిస్ తో గానం చేస్తుంటే రాధమ్మ బాధ అంతా అలా కనుల ముందు సాక్షత్కరించేస్తుంది. ఈ చక్కని పాట ఇక్కడ చూసీ వినీ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం: జయభేరి (1959)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

ఆ..ఆ... ఆ... ఆ... ఆ.. ఆ..
సంధ్యా సమయమున
యమునా యమునా తీరమున...


ఆ..ఆ... ఆ... ఆ... ఆ.. ఆ..
యమునా తీరమున... సంధ్యా సమయమున
యమునా తీరమున... సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ.. వేచి యున్నది కాదా..

మంజు ఏం ఆపేసావ్... ఏమి లేదు
ఆపకు మంజు.. నీ కాలి మువ్వల సవ్వడి
నా పాటకు నడక నేర్పాలి
నా గానానికి జీవం పొయ్యాలి

రావోయి రాసవిహారి... ఈ... ఈ..
ఇటు రావోయి వనమాలి... ఈ... ఈ..

ఆ... ఆ... ఆ... ఆ ఆ ఆ ఆ ఆ
యమునా తీరమున సంధ్యా సమయమున
యమునా తీరమున సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ.. ఆ... ఆ
వేయి కనులతో రాధ... వేచి యున్నది కాదా
యమునా తీరమునా

బాస చేసి రావేల మదన గోపాలా.. ఆ... ఆ... ఆ...
ఆ... ఆ... ఆ...
బాస చేసి రావేల... మదన గోపాలా
నీవు లేని జీవితము... తావి లేని పూవు కదా

యమునా తీరమున... సంధ్యా సమయమున
యమునా తీరమున... సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ... వేచి యున్నది కాదా
యమునా తీరమునా... ఆ... ఆ... ఆ...

పూపొదలో దాగనేల... పో పోరా సామి...
ఇంతసేపు ఏ ఇంతికి వంత పాడినావో...
దాని చెంతకె పోరాదో...

రానంత సేపు విరహమా...
నేను రాగానే కలహమా...
రాగానే కలహమా...

నీ మేన సరసాల చిన్నెలు...
అవి ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ...
ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ...

దోబూచులాడితి నీతోనే...
ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు...
ఈ కొమ్మ గురుతులు కాబోలు...

నేను నమ్మనులే...
నేను నమ్మనులే.. నీ మాటలు
అవి కమ్మని.. పన్నీటి మూటలు
నా మాట నమ్మవే రాధికా...
ఈ మాధవుడు నీ వాడేగా...
రాధికా... మాధవా...
రాధికా... మాధవా...
రాధికా... మాధవా...
రాధికా... మాధవా...

2 comments:

యమునా తీరం పై వచ్చిన నల్లనయ్య పాటలలో..వన్ ఆఫ్ ద మధురగీతం..ఇప్పుడే లోకాల్లో నవ్వుకుంటున్నారో అంజలీదేవిగారు..

థాంక్స్ శాంతి గారు.. అవునండీ ఇపుడేలోకాల్లో నవ్వుకుంటుండి ఉంటారో అంజలీ దేవి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.