బుధవారం, జనవరి 08, 2014

చూడుమదే చెలియా కనులా

మురళీ కృష్ణుని మోహన గీతికి పరవశమైనవి లోకములే
ఏ.ఎమ్.రాజా గారి స్వరంలో ఓ ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది మూగవైన ఏమిలే అన్నా చూడుమదే చెలియా అన్నా ఈ ప్రత్యేకత అమృతంలా మన వీనుల ద్వారా హృదయానికి చేరుకుని కనుల ముందు సన్నివేశాన్ని సాక్షత్కరింపచేసేస్తుంది. తను గానం చేసిన విప్రనారాయణ లోని ఈ మధురమైన పాట నాకు చాలా ఇష్టం, వీడియో ఇక్కడ చూడవచ్చు లేదా ఎంబెడ్ చేసిన ఈ సినిమా వీడియోలో ఒక గంటా పదినిముషాల వరకూ ఫార్వర్డ్ చేసి చూడండి, ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.చిత్రం : విప్రనారాయణ (1954)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు 
సాహిత్యం : సముద్రాల 
గానం : ఏ.ఎమ్.రాజా 

చూడుమదే చెలియా..కనులా
చూడుమదే చెలియా..కనులా
చూడుమదే చెలియా..


బృందావనిలో నందకిశోరుడు
బృందావనిలో నందకిశోరుడు
అందముగా దీపించే లీలా...
చూడుమదే చెలియా..కనులా
చూడుమదే చెలియా..


మురళీ కృష్ణుని మోహన గీతికి
మురళీ కృష్ణుని మోహన గీతికి
పరవశమైనవి లోకములే..
పరవశమైనవి లోకములే
విరబూసినవీ పొన్నలు పొగడలు
విరబూసినవీ పొన్నలు పొగడలు
పరిమళమెగసెను మలయానిలముల 
సోలెను యమునా...

చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..

నారీ నారీ నడుమ మురారి
నారీ నారీ నడుమ మురారి
హరికీ హరికీ నడుమ వయ్యారీ
హరికీ హరికీ నడుమ వయ్యారీ
తానొకడైనా...ఆఆ.అ.అ.ఆఅ...
తానొకడైనా తలకొక రూపై
తానొకడైనా తలకొక రూపై
మనసులు దోచే రాధామాధవ కేళీ నటనా..

చూడుమదే చెలియా..
కనుల చూడుమదే చెలియా..

2 comments:

ఏ.యన్.ఆర్ నాస్తికులంటే నేను చాలా కాలం నమ్మలేదు వేణూజీ..ఆధ్యాత్మికతకి అభినయ దర్పణం లా అనిపిస్తారాయన..

అవును శాంతి గారు నిజమైన మహానటులు అంటే అలాగే ఉంటారేమో నాస్తికులై ఉండి కూడా భక్తునిగా అంతగా మెప్పించగలగడం అనితరసాధ్యం.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.