మంగళవారం, జనవరి 14, 2014

నీ నవ్వు చెప్పింది

ధనుర్మాసం పదమూడుతో ముగియడంతో ఈసారి క్యాలెండర్ మంత్ ఫాలో అయి ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే కనుక ఈ 14 నుండి వచ్చేనెల 14 వరకూ వాలంటైన్స్ మంత్ సెలెబ్రేట్ చేద్దామని డిసైడ్ అయ్యాను కనుక ఈ సంధర్బంగా నాకు నచ్చిన అందమైన ప్రేమ గీతాలు మీకోసం. 

ముందుగా అంతం సినిమాలోని "నీ నవ్వు చెప్పింది" పాట. సినిమా రిలీజైన సమయంలో ఈ పాట ఎంత ఫేమస్సో ఇప్పటికీ ఎందరి ఎంపీత్రీ ప్లేయర్స్ లో తరచుగా ప్లే అవుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదేమో. సిరివెన్నెల గారి సాహిత్యం చాలా బాగుంటుంది. ఈ అందమైన పాట మీరూ చూసీ విని ఎంజాయ్ చేయండి. ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని వినవచ్చు.
  
 

చిత్రం : అంతం
సంగీతం : R.D.బర్మన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు 

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
ఓ..లాలలాల.... ఓ..లాలలాల..
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ...
ఓ.. నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపు నీ
పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని

నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించని నడి రేయి కరిగించనీ
నా పెదవిలో నువ్వు ఇలాగె చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ

ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో 
హా... ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యెందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు

హాఅ...లాలలాల..హాహ..లాలలాల..

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

మిత్రులందరికీ ఈ చక్కని దేవులపల్లి వారి పాటతో 
సంక్రాంతి శుభాకాంక్షలు. 
 
ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.


చిత్రం: ఉండమ్మా బొట్టు పెడతా (1968)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: బాలు, సుశీల

రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా

నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
కొలువై ఉందువుగాని...కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా... రావమ్మా

గురివింద పొదకింద గొరవంక పలికె... 

గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె ...
గురివింద పొదకింద గొరవంక పలికె... 

గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె

తెల్లారి పోయింది పల్లె లేచింది...
తెల్లారి పోయింది పల్లె లేచింది... 

పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది

రావమ్మా మహాలక్ష్మీ... రావమ్మా... రావమ్మా... కృష్ణార్పణం

కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి...గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి... గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు

కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి... గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి... గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు


ముత్యాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు 


రావమ్మా మహాలక్ష్మీ... రావమ్మా... రావమ్మా... కృష్ణార్పణం

పాడిచ్చే గోవులకు పసుపుకుంకం...

పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
పాడిచ్చే గోవులకు పసుపు కుంకం... 

పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం ...
గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం ...
కష్ఠించే కాపులకు కలకాలం సౌఖ్యం ...కలకాలం సౌఖ్యం ..

రావమ్మా మహాలక్ష్మీ ...రావమ్మా

నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
కొలువై ఉందువుగాని...కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా ...రావమ్మా...కృష్ణార్పణం


8 comments:

మొదటి పాట భలే చక్కటిది ఎంచుకున్నారండీ..
"నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ, వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించనీ"...అన్నది పూర్తిగా సిరివెన్నెల మార్క్. బాలు గొంతు, సాహిత్యం అన్నీ బాగున్నా, ఈ పాట క్రెడిట్ మాత్రం ఆర్.డి బర్మన్‌కే ఇవ్వాలనిపిస్తుంది నాకు. Thank you.I have a beautiful song to sing for the rest of the day. :)

this is one my all time fav .. always play on my mobile

ఈ నెలరోజులూ ప్రేమ భక్తులు రోమియోల కోసమన్నమాట.... బాగుంది బాగుంది :)

"నీ నవ్వు చెప్పింది నాతో" is undoubtedly a beautiful song, both lyrically and musically.

$iddharth

థాంక్స్ మానస గారు. నేను మాత్రం ఆర్డీకి సిరివెన్నెల గారికీ ఈక్వల్ గా క్రెడిట్ ఇస్తానండీ :-)
థాంక్స్ ప్రదీప్ గారు..
హహహ అంతే నాగార్జునా థాంక్స్ :)
థాంక్స్ సిద్దార్ధ్ గారు..

నిజమే..ప్లాస్టిక్ నవ్వు, ప్రేమ నవ్వు..పలకరింపు నవ్వు, వెక్కిరింపు నవ్వు..అనురాగపు నవ్వు, అవహేళన నిండిన నవ్వు..ఇలా..యెదుటి వారి మనసులో మన స్థానమేమిటో చెప్పేది వారి పెదవులపై కదలాడే నవ్వే కదా..బిలీటెడ్ సంక్రాంతి విషెస్ వేణూజీ..

సెలబ్రేటింగ్ వేలెంటినో మంత్..లవ్లీ ఐడియా సర్జీ..

థాంక్స్ శాంతి గారు, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు :-) హహ నవ్వులలో రకాలు బాగా చెప్పారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.