మంగళవారం, జనవరి 21, 2014

మాటే మంత్రమూ

ఈ పాట గురించి ఏం చెప్పగలం, ఇప్పటివరకూ ఈ పాట వినని తెలుగు వాళ్ళుంటారని నేను అనుకోను. ఈ కమ్మని ఇళయరాజా గీతాన్ని మీరూ మరోసారి ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : శీతాకోక చిలుక (1981)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, శైలజ

ఓం శతమానం భవతి శతాయుః పురుష‌
శతేంద్రియ ఆయుష్షేవేంద్రియే ప్రతి తిష్ఠతీ !


మాటే మంత్రమూ
మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం


ఓ ఓ మాటే మంత్రమూ.. మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం

ఓ ఓ మాటే మంత్రమూ.. మనసే బంధమూ

నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా..పూవూ తావిగా
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో

మాటే మంత్రమూ..మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం

ఓ ఓ మాటే మంత్రమూ..మనసే బంధమూ

నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవివే

ఎద నా కోవెలా.. ఎదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో

మాటే మంత్రమూ..మనసే బంధమూ 

 ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓఓఓ..లాలలాలలా..లాలలాలలా..
ఊహూహూహూ..ఊహూ.హుహు

4 comments:

చాలా చాలా ఇష్టమైన పాటండి.మా సాయిక్కూడా :)raadhika (nani)

మంత్రమంటి పాట వేణూజీ..ఇందులోని మిన్నీటి సూరీడు సాంగ్ పిక్చరైజేషన్ టూ మచ్ గా వుందని అప్పట్లో సినిమా చూడనివ్వలేదు..ఇప్పుడు చూస్తుంటే..ఇప్పటి కాలేజ్ ఫేర్వెల్ సాంగ్స్ కంటే కూడ అదే మోస్ట్ డీసెంట్ యెండ్ పొయిటిక్ సాంగ్ యేమో అనిపిస్తోంది.

Was expecting this song much earlier.
5/5

$iddharth

థాంక్స్ రాధిక గారు :-)
థాంక్స్ శాంతి గారు :-) హహహ పాటల చిత్రీకరణ స్టాండర్డ్స్ అలా మారిపోతున్నాయండీ ఏం చేస్తాం :-)
థాంక్స్ సిద్దార్థ్ గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.