హ్మ్.. గతమూడురోజులుగా విన్న పాటలు చూసి ప్రేమలేఖలూ ఎలా చెప్పాలో తెలీక కన్ఫూజ్ అవడాలు కేవలం మగవారికి మాత్రమే పరిమితం కాబోలు అనుకుంటున్నారా.. లేదండీ నిజానికి ప్రేమకి ఆడామగా తేడా లేదు ఒకసారి ఆ దోమ కుట్టిందంటే పడే పాట్లు అందరి విషయంలోనూ కామనే. ఇదిగో ఈ అమ్మాయిని చూడండి తనమనసులో ఉన్న ప్రేమంతా ఆ అబ్బాయికి చెప్పాలని ఉందట కానీ అతడెదురుపడితే బిడియం అడ్డుపడుతుందట ఆ విషయం మనకి చెప్పీ చెప్పకనే తన ప్రేమావస్థనంతా ఎలా ఈ పాట రూపంలో స్పష్టంగా చెప్పేస్తుందో సిరివెన్నెల గారి మాటలలో మీరూ వినండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.
చిత్రం : ప్రియమైన నీకు(2000)
సంగీతం : శివశంకర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చిత్ర
మనసున ఉన్నదీ చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి
బైటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో
తెలపక పోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
ల ల ల లా.... ల ల ల ల ల ల లా.....
ల ల ల లా.... ల ల ల ల ల ల లా.....
చింత నిప్పైన చల్లగ ఉందని
ఎంత నొప్పైన తెలియలేదని
తననే తలుచుకునే వేడిలో
ప్రేమ అంటేనె తియ్యని బాధని
లేత గుండెల్లొ కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతోందా నా ప్రియమైన నీకు
నా ఎద కోత అని అడగాలనీ
అనుకుంటు తన చుట్టూ మరి తిరిగిందనీ
తెలపక పోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
నీలి కన్నుల్లొ అతని బొమ్మని
చూసి నాకింక చోటెక్కడుందని
నిదరే కసురుకునే రేయిలో
మేలుకున్నా ఇదేం వింత కైపని
వేల ఊహల్లొ ఊరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైన నీకు
ఆశల రాగం అని అడగాలనీ
పగలేదో రేయేదో గురుతే లేదనీ
తెలపక పోతే ఎలా
మనసున ఉన్నదీ చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి
బైటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో
తెలపక పోతే ఎలా... ఆ.....
ల ల లా.. ల ల ల ల
ల ల ల ల లా లా...
ల ల లా.. ల ల ల ల
ల ల ల ల లా లా...
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
ఇక ఈవిడ అవస్థ చూస్తారా అసలు ప్రేమని ఎలా తెలుపాలో అర్ధంకాక చంద్రబోసు గారి మాటల సాయం తీసుకుని తన ప్రేమని ప్రియుడికి ఎలా చెప్పటం బెటరో చెప్పమని మనల్నే సలహా అడుగుతుంది, మీరేమైనా సహాయం చేయగలరేమో ఓ సారీ పాట విని చెప్పండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.
చిత్రం : నువ్వులేక నేను లేను (2002)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : చంద్రబోస్
గానం : ఉష
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసి చూపనా
నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపనా
వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు
ఏర్చి కూర్చి చూపనా
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
రామచిలుక గోరువంక బొమ్మ గీసి తెలుపనా
రాధాకృష్ణుల వంక చేయిచూపి తెలుపనా
చిరునవ్వుతో తెలుపనా కొనచూపుతో తెలుపనా
నీళ్ళు నమిలి తెలుపనా గోళ్ళు కొరికి తెలుపనా
తెలుపకనే తెలుపనా..
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
కాలివేలు నేల మీద రాసి చూపనా
నా చీరకొంగు తోటి వేలు చుట్టి చెప్పనా
కూనలమ్మ పాటలో రాయబారమంపనా
గాలికైనా తెలియకుండా మాట చెవిని వేయనా
నాలో ప్రాణం నీవనీ..
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసి చూపనా
నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా
వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు
ఏర్చి కూర్చి చూపనా
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
5 comments:
Thank you Venu gaaru for posting :-)
'మనసున ఉన్నదీ' పాట ఒకప్పుడు నా ఊపిరిలా ఉండేది. :-)
థాంక్స్ శ్రావ్యా, నిషీ :-)
మనసున వున్నదీ తరువాత శివ శంకర్ గారు మళ్ళీ పెద్దగా మ్యూజిక్ పై దృష్టిని నిలుపలేదెందుకో మరి..విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ద ఫాన్స్ ఆఫ్ దీజ్ సాంగ్స్..మీ వేలెంటైన్ తోట లో ఈ పాటలు రెండూ హైబ్రీడ్ గులాబీల్లా అనిపించాయి వేణూజీ..
థాంక్స్ శాంతి గారు :-) కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ అంతేనండీ ఒకటిరెండు సినిమాలతో మెరుపులు మెరిపించి వెళ్ళిపోతుంటారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.