శుక్రవారం, జనవరి 03, 2014

చిన్ని చిన్ని కన్నయ్యా..

ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ పాట నా చిన్నతనంలో తెలియక పసిపిల్లలకి పాడే జోలపాటలాగే ఫీలయ్యే వాడిని ఆనక ఊహ తెలిశాక మొదటిసారి చిత్రీకరణ చూసినపుడు ఉయ్యాలలో హీరోగారిని చూశాక షాక్ తో పాటు నవ్వుకూడా వచ్చేసింది అయినాకూడా ఆ జోలపాట అన్న ఇంప్రెషన్ మాత్రం పోలేదు. ఏసుదాసు గారి గాత్రం గురించి చెప్పేదేముంది అన్యోన్య దాంపత్యాన్ని కళ్ళముందు నిలుపుతూ సాగే ఈ పాట జయప్రదపై చిత్రీకరించడం పాటకే ఓ కొత్త అందాన్ని తెచ్చింది. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీరూ చూసి/విని ఆస్వాదించండి. ఆడియో మాత్రం వినాలంటే రాగాలో ఇక్కడ వినండి. చిత్రం : భద్రకాళి (1977)
సాహిత్యం : దాశరథి
సంగీతం : ఇళయరాజా
గానం : జేసుదాస్, పి.సుశీల

చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేనూ
ఎత్తుకొని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ
జోలపాట పాడేనూ లాలిపాట పాడేనూ

చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేనూ

నీ ఒడిలో నిదురించీ తీయనీ కలగాంచీ
పొంగి పొంగి పోయానూ పుణ్యమెంతో చేశానూ
నీ ఒడిలో నిదురించీ తీయని కలగాంచీ
పొంగి పొంగీ పోయానూ పుణ్యమెంతో చేశానూ
ఏడేడు జన్మలకూ నాతోడు నీవమ్మా
ఈనాటి ఈ బంధం ఏనాడు విడదమ్మా
అమ్మవలె రమ్మనగా పాపవలె చేరేవూ
నా చెంత నీవుంటే స్వర్గమే నాదౌనూ
గాయత్రి మంత్రమునూ జపించే భక్తుడనే
కోరుకున్న వరములనూ ఇవ్వకున్న వదలనులే

స్నానమాడి శుభవేళా కురులలో పువ్వులతో
దేవివలే నీవొస్తే నా మనసు నిలువదులే
స్నానమాడి శుభవేళా కురులలో పువ్వులతో
దేవివలే నీవొస్తే నా మనసు నిలువదులే
అందాల కన్నులకూ కాటుకను దిద్దేనూ
చెడుచూపు పడకుండా అదరుచుక్క పెట్టేనూ

చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేనూ
ఎత్తుకొని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ
జోలపాట పాడేనూ
లాలిపాట పాడేనూ
జోలాలి...జోలాలి...
జోలాలి...జోలాలి...
జోజోజో...

6 comments:

నేను కూడా చిన్నప్పుడు ఇదేదో పిల్లల కోసం పాడే పాటెమో అనుకునేదాన్నండీ..ఈమధ్యనే యుట్యూబ్లో చూసి ఆశ్చర్యపోయా :)

oh God !
I 'am really shocked to know that this is a song picturised on adults. Till date I was thinking this is on a baby and somehow I was thinking it is from either DVSkarna or vinayaka vijayam. This is the song which I always always sing ( I add my own lyrics at some places though) to my kids so much that even they got hold of the tune. thanks for sharing venu gaaru.
Though I read your blog, never posted a comment. You really do a great work on songs and other topics too.

Thanks
Surabhi

థాంక్స్ వేణు జీ !

నేను ఈ పాట సినిమా/ లేదూ ఈ టీవీ లో ఏదో పాత పాటలు వేస్తూ ఉండేవాడు అప్పట్లో అందులోనో వినటం / చూడటం ఒక్కసారే జరగటం వల్లనేమో అసలు ఇది పిల్లల పాట అన్న ఆలోచన రాలేదు :-) సినిమా లో ఇలా picturize చేయటం వెనక కారణం ఉంది అనుకుంటా . సరిగా గుర్తు లేదు కానీ, జయప్రద పిచ్చిది అవుతుంది మురళి మోహన్ని ఇంతలా చూసుకున్నా తనకి అవసరం అయినప్పుడు ఆ attention ఇవ్వడో ఏదో ఉంది . If I am not wrong ఈ పాట సినిమాలో రెండు సార్లు ఉంటుంది .
youtube లో వెతికితే సినిమా దొరకచ్చునేమో కానీ ఇప్పుడు అంత ఓపిక లేదులెండి :-)))

ఇట్స్ ఏ సైకలాజికల్ థ్రిల్లర్ మూవి..చాలా డిఫరెంట్ టేకింగ్..చాలా హాంటింగ్ గా వుంటందండీ ఈ మూవి..ఈ పాట వింటుంటే "మల్లె తీగ వంటిదీ" సాంగ్ గుర్తొచ్చిందండీ..వీలైతే ఆ పాట పోస్ట్ చేస్తారా వేణూజీ..

hmmm...just wondering ఎందుకని ఇది జోలపాట అనిపించింది వేణూ గారు? చరణాలు వింటే ఇది భార్యా,భర్త/ప్రేయసీ,ప్రియుల మధ్య సాగే పాటలాగే ఉంది కదా. మూవీ నేను చూడలేదు, యూ ట్యూబ్ లొ వెతుకుతాను దొరుకుతుందేమో...

మీకు కుదిరితే "ఒకరితో ఒకరుగా ఇద్దరం, ఒకరిలో ఒకరుగా ఒక్కరం..ఇదే మధుర భావం" సాంగ్ పోస్ట్ చేస్తారా? మూవీ పేరు గుర్తు లేదు, కానీ రజనికాంత్ మూవీ, మ్యూజిక్ ఇళయరాజా గారు /\. సాంగ్ పిక్చరైజ్ చేసింది మాత్రం సుజాత మీద(ఆ సినిమాలో హీరోయిన్ రతీ అగ్నిహోత్రి అనుకుంటా)

It's a simple song, but I just love this song for some reason. For me, this is one of the best songs of Suseela gaaru in Ilayaraja garu's music direction.

థాంక్స్ తృష్ణ గారు :-)

మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు సురభి గారు :-)

థాంక్స్ శ్రావ్యా మీకు ఆసక్తి ఉంటే ఇదిగోండి సినిమా ఇక్కడ ఉంది మళ్ళీ ఓసారి రివైజ్ చేయచ్చు. http://www.youtube.com/watch?v=gZRrR-LhFq0

థాంక్స్ శాంతి గారు సినిమా గురించి నాకూ తెలీదండీ లింక్ కనిపించింది మీరు సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పాక చూడాలనిపిస్తుంది, చూస్తాను. అలాగేనండీ మీరడిగిన పాట పోస్ట్ చేస్తాను.

మహెక్ గారు చిన్నతనంలో పల్లవి మీదే తప్ప చరణం సాహిత్యంపై ఫోకస్ చేసేవాడ్ని కాదండీ అందుకే చిన్న పిల్లల జోలపాట అనిపించింది అప్పట్లో. మీరడిగిన పాట మాయదారికృష్ణుడు సినిమాలోనిదండీ త్వరలో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.