ఇళయరాజా గారి మరో మాజిక్ ఈ ఆకాశం ఏనాటిదో పాట... ఆత్రేయ గారి సాహిత్యం ఎంత అద్భుతంగా ఉంటుందో మాటలలో చెప్పలేం. అచ్చమైన ప్రేమ పాటంటే ఇదేనేమో అనిపిస్తుంది. ప్రేమ అనేది విధి వ్రాత అనీ ప్రీ డిఫైన్డ్ డెస్టినీ అని సాగే ఈ పాట సాహిత్యం నాకు చాలా ఇష్టం. ఈ చక్కని పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినండి.
చిత్రం : నిరీక్షణ (1981)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : జానకి
లాలలా..లాలాలల..లాలలా..లాలాలల
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ
ల లా లా లా లా...
లా లా లా ఆ..లా లా
ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ
ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
పరువాలే..ప్రణయాలై.. స్వప్నాలే...స్వర్గాలై...
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదెను
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ
కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించీ గెలిపించమనగ
మోహాలే.. దాహాలై....సరసాలే.. సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
లాల్లాల.లలలల.లాలాల లలలాల..
లాల్ల..లలలల..లాల్లాలా లలలాల..
2 comments:
ప్రేమా ప్రకృతి యెప్పుడూ కొత్తగానే వుంటాయి వేణూజీ..ఈ పాట తరచుగా జెమిని సాంగ్స్ లో వసుంటుంది..నేనూ,మావారు ఈ పాట యెప్పుడు విన్నా ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళిపోతామండీ..
థాంక్స్ శాంతి గారు... :-) అవి రెండూ కొత్తగా ఉండటమే కాదండీ రెండిటినీ Explore చేసే కొద్దీ చిత్ర విచిత్రాలను కూడా చూపిస్తాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.